Pradeep Ranganathan's Dude Movie First Poster Unvieled: 'లవ్ టుడే' ఫేం ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్‌గా 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీతో మంచి విజయం అందుకున్నారు. ఇదే జోష్‌తో ఆయన తన నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా లెవల్‌లో ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించనుంది.

పోస్టర్ అదుర్స్

మూవీలో ప్రదీప్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ముఖంపై గాయాలు చేతిలో తాళితో పిడికిలి బిగించి ప్రదీప్ మాస్ లుక్‌లో అదరగొట్టారు. ''డ్యూడ్‌'కు దారి ఇవ్వండి. మీ అందరినీ గొప్పగా అలరించడానికి వస్తున్నాడు.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ దీపావళి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిఫరెంట్ లుక్‌లో పోస్టర్ చూసిన ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

ప్రేమలు బ్యూటీతో..

ఈ మూవీతోనే కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయం కానుండగా.. ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తున్నారు. సీనియర్ నటుడు శరత్ కుమార్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటే రోహణి మొల్లేటి, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించనుండగా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మూవీ రిలీజ్ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ మూవీని నిర్మించనున్నారు.

Also Read: హ్యాపీ బర్త్ డే విజ్జీ - విజయ్ దేవరకొండకు రష్మిక క్యూట్ విషెష్.. ఒకే రోజు ఫ్యాన్స్‌కు రెండు గిఫ్ట్స్

ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ మూవీ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. చిన్న సినిమాగా వచ్చి దాదాపు రూ.130 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ప్రదీప్ సరసన అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్స్‌గా నటించారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు.

ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్,  మిస్కిన్ కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో ఇప్పటికే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండగా ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. మంచి స్టోరీస్‌తో సక్సెస్ సాధిస్తున్న ప్రదీప్ తన తర్వాత మూవీ సైతం అదే రేంజ్‌లో ఉండనుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మాస్ లుక్‌లో ప్రదీప్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.