ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) దర్శకుడిగా చేసిన తొలి సినిమా 'కోమలి' మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో చివర్లో ఓ చిన్న పాత్రలో ప్రదీప్ రంగనాథన్ కనిపిస్తాడు. అయితే రెండో ప్రాజెక్ట్‌గా 'లవ్ టుడే' కాన్సెప్ట్‌ని రాసుకుని చాలా చోట్ల తిరిగాడు. హీరో దొరక్కపోవడం, సరిగా సెట్ కాకపోవడంతో... తానే హీరోగా 'లవ్ టుడే'ని తీశాడు ప్రదీప్ రంగనాథన్. ఆ సినిమాకు అనూహస్యమైన విజయం దక్కింది. తెలుగు, తమిళంలో లవ్ టుడ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత 'డ్రాగన్', 'డ్యూడ్' సినిమాలు కూడా మంచి విజయాల్ని అందుకున్నాయి.

Continues below advertisement

మూడు వంద కోట్ల సినిమాల తర్వాత ఫ్లాప్!వరుసగా వంద కోట్లు కొల్లగొడుతూ హ్యాట్రిక్ హిట్ సాధించాడు ప్రదీప్ రంగనాథన్. విఘ్నేశ్ శివన్‌తో కలిసి ప్రదీప్ చేసిన లైక్ మూవీని జనాలు లైక్ చేయలేదు. ఈ సినిమాని విఘ్నేశ్ నాన్చి నాన్చి తీశాడు. ఈ చిత్రం కోసం ముందుగా 250 కోట్ల బడ్జెట్ అనుకున్నాడట. ఆ తరువాత నిర్మాతలెవ్వరూ ముందుకు రాకపోవడంతో వంద కోట్లు తగ్గించి 150 కోట్లకు బడ్జెట్ కుదించాడట. ఇక నిర్మాతలు దొరక్కపోవడంతో నయన్ ముందుకు వచ్చి నిర్మించింది. ముక్కుత్తి అమ్మాన్ సినిమాకి వచ్చిన పేమెంట్‌తో ఈ మూవీని నయన్ నిర్మించిందని విఘ్నేశ్ చెప్పాడు.

Also Readవేరే దేశంలో అయితేనా? శ్రీరాముడిపై ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు, రామాయణం కాంట్రవర్సీపై నాగబాబు రియాక్షన్

Continues below advertisement

అయితే నయన్ పెట్టిన ఖర్చుకి లాభాలు మాత్రం రాలేదని అర్థం అవుతోంది. ప్రదీప్ రంగనాథన్ కెరీర్‌లో ఫస్ట్ ఫ్లాప్‌గా ఈ లైక్ నిలిచింది. ఇది కూడా నయన్ భర్త పుణ్యమే అని అనుకోవచ్చు. విఘ్నేశ్ కెరీర్‌లో ఉన్నదే ఒక హిట్టు. నేనూ రౌడీనే తప్పా ఇంకో సినిమాతో విఘ్నేశ్ తనని తాను ఫ్రూవ్ చేసుకోలేదు. నయన్‌తో ప్రేమలో ఉండటం, తిరగడం, పెళ్లి ఇవే ఆయనకు సరిపోలేదు. ఇక ఇప్పుడు ఇలా లైక్ సినిమాతో వచ్చి ప్రదీప్‌కి ఓ ఫ్లాప్ ఇచ్చినట్టు అయింది.

Also ReadBad Boy Karthik Movie Review - 'బ్యాడ్ బాయ్ కార్తీక్' రివ్యూ: బాబోయ్... మరీ అంత బ్యాడా? నాగశౌర్య సినిమాను చూడలేమా?

ఇంత వరకు లైక్ మూవీకి దాదాపు 54 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చినట్టుగా కనిపిస్తోంది. చూస్తుంటే ఈ సినిమా భారీ నష్టాల్ని మిగిల్చేలా ఉంది. ఇప్పటి వరకు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన మూడు సినిమాలూ వంద కోట్ల కలెక్షన్స్ మార్క్ అందుకున్నాయి. కానీ, 'లైక్' ఆ ఫీట్ రిపీట్ చేయడం కష్టమే అని ట్రేడ్ వర్గాల విశ్లేషణ. మరి ప్రదీప్ రంగనాథన్ మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తాడా? వంద కోట్లు కొల్లగొడతాడా? లేదా? అన్నది చూశారు. నయన్ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటే బెటర్.. ఇక సినిమాలకు దూరంగా ఉంటేనే మంచిది అని ఆడియెన్స్ విఘ్నేశ్ శివన్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

Also ReadPapam Prathap: అయ్యో పాపం... రాశి అనుకున్నది ఒక్కటి అయినది మరొకటి!