విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) చేసే వ్యాఖ్యలు, వేసే ట్వీట్లు ఎంతటి వివాదాలకు దారి తీస్తుంటాయో అందరికీ తెలిసిందే. తాను నాస్తికుడిని అని చెబుతూ హిందూ మతం మీద, రామాయణం మీద ఆయన చేసిన కామెంట్స్ పట్ల ఇప్పుడు దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. రాముడిది నార్త్, రావణుడిది సౌత్.... రాముడు పండ్లను దొంగతనం చేయడం వల్లే ఘర్షణ మొదలైంది అంటూ ప్రకాష్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ప్రకాష్ రాజ్ మీద వ్యతిరేకజ్వాలలు మొదలయ్యాయి. చాలా చోట్ల కేసులు కూడా నమోదు చేశారు.

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్!ప్రకాష్ రాజ్ వ్యవహరం, వివాదం మీద జనసేన నాయకుడు, ఎమ్మెల్సీ, నటుడు నాగబాబు స్పందించారు. ఇటీవల జరిగిన ప్రకాష్ రాజ్ తల్లి అంత్యక్రియలు కూడా వివాదాస్పద వ్యాఖ్యలకు దారి తీసిన సంగతి తెలిసిందే. వాటిని సైతం మెగా బ్రదర్ ప్రస్తావించారు. ''ప్రకాష్ రాజ్ గారూ... మిమ్మల్ని మీరు క్రైస్తవ నాస్తికుడని చెప్పుకున్నప్పటికీ, మీ తల్లిగారి అంత్యక్రియలు జరిగినప్పుడు ఆమె విశ్వాసాన్ని గౌరవించారు. ఒక కొడుకుగా అది మీ కర్తవ్యం. దాన్ని మేం గౌరవిస్తాం. అదే స్ఫూర్తితో మీరు కోట్లాది మంది ప్రజల నమ్మకాలను గౌరవించాలి. నాస్తికత్వం అంటే దేవుళ్ళను గానీ, దేవుని పట్ల విశ్వాసం ఉన్న వారిని గానీ అపహాస్యం చేయడం కాదు. అది ఒక హేతుబద్ధమైన ఆలోచనా విధానం. తన సిద్ధాంతాల ద్వారా నాస్తిక తత్వాన్ని కూడా స్వీకరించిన ఏకైక మతం హిందూమతం మాత్రమే. అటువంటి సంప్రదాయాన్ని తోసిపుచ్చడం హేతుబద్ధం కాదు, అది అగౌరవం'' అని నాగబాబు పేర్కొన్నారు.

Also ReadBad Boy Karthik Movie Review - 'బ్యాడ్ బాయ్ కార్తీక్' రివ్యూ: బాబోయ్... మరీ అంత బ్యాడా? నాగశౌర్య సినిమాను చూడలేమా?

ఇతర దేశాలలో అయితే ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రకాష్ రాజ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు అని నాగబాబు వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''భవిష్యత్తులో మీలాంటి గౌరవహీనమైన వ్యక్తులతో నేను ఎప్పటికీ వాదించను. విభిన్న విశ్వాస వ్యవస్థలను గౌరవించడమే హేతుబద్ధతకు, బాధ్యతకు నిజమైన నిదర్శనం'' అని రియాక్ట్ అయ్యారు.

Also ReadPapam Prathap: అయ్యో పాపం... రాశి అనుకున్నది ఒక్కటి అయినది మరొకటి!

పవన్ కళ్యాణ్, నాగబాబు మీద ప్రకాష్ రాజ్ ఎలాంటి సెటైరికల్ కామెంట్స్ చేస్తుంటారో అందరికీ తెలిసిందే. మరి నాగబాబు ఇచ్చిన ఈ కౌంటర్ల మీద ప్రకాష్ రాజ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఇక దేశ వ్యాప్తంగా ప్రకాష్ రాజ్ మీద నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాన్ ప్రకాష్ రాజ్ అంటూ ట్వీట్లు వేస్తున్నారు. బహిరంగంగా క్షమాపణ చెప్పాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. మరి ఈ కాంట్రవర్సీకి ప్రకాష్ రాజ్ ఏ విధంగా పుల్ స్టాప్ పెడతారో చూడాలి.

Also ReadPapam Prathap Movie Review - పాపం ప్రతాప్ రివ్యూ: థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు చూసి పాపం అనుకోవాలా?... తిరువీర్ సినిమా ఎలా ఉందంటే?