‘RRR’ సినిమా తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న తాజా సినిమా RC15. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. రాంచరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఆస్కార్ వేడుక నేపథ్యంలో రామ్ చరణ్ కొద్ది రోజుల పాటు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. ఇటీవలే మళ్లీ షూటింగ్ కు హారవుతున్నారు. శరవేగంగా సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు దర్శకుడు.  


చెర్రీకి అదిరిపోయే స్వాగతం పలికిన RC15 టీమ్


ఇక తాజాగా ఆస్కార్ అవార్డును గెలిచన తర్వాత RC15 టీమ్ రామ్ చరణ్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు. కొరియోగ్రాఫర్ ప్రభు దేవా ఆధ్వర్యంలో RC15 టీమ్ అంతా కలిసి ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేశారు. ఆస్కార్ విన్నింగ్ తర్వాత సెట్స్ లోకి రాబోతున్న చెర్రీకి ఘన స్వాగతం పలికారు. RC15 టీమ్ గ్రాండ్ వెల్కమ్ పట్ల చెర్రీ సంతోషం వ్యక్తం చేశారు. టీమ్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభు దేవాకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. షూటింగ్ లోకి తిరిగి అడుగు పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు.  






ఇక రామ్ చరణ్, శంకర్ సినిమా మొదలై చాలా రోజులు అయ్యింది. మధ్యలో కమల్ హాసన్ 'భారతీయుడు 2' చిత్రీకరణకు శంకర్ చెన్నై వెళ్ళడం, 'ఆర్ఆర్ఆర్'కు విదేశాల్లో అవార్డులు రావడంతో రామ్ చరణ్ అక్కడకు వెళ్ళడం వల్ల బ్రేకులు పడ్డాయి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, జూన్ నెలాఖరుకు సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారట.


డ్యుయెల్ రోల్ చేస్తున్న రామ్ చరణ్


శంకర్ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా కనిపించనున్నారు. అభ్యుదయం పార్టీ సీయం క్యాండిడేట్ చరణ్. రాజమండ్రి, విశాఖలో ఆ సీన్స్ తీసినప్పుడు విజువల్స్ లీక్ అయ్యాయి. ఫ్లాష్‌బ్యాక్ కాకుండా ప్రజెంట్‌కు వస్తే... ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారు. తండ్రీ కొడుకులుగా రెండు క్యారెక్టర్లు ఉంటాయని టాక్. ఈ సినిమాలో మరో కథానాయికగా  తెలుగమ్మాయి అంజలి నటిస్తున్నారు. ఆమె ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో చరణ్ భార్యగా కనిపించనున్నారు. శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై 'దిల్‌' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.


ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమాకు సైన్ చేశారు. ‘ఉప్పెన’ లాంటి సూపర్ హిట్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన బుచ్చిబాబు ఇప్పుడు రామ్ చరణ్ కోసం కూడా ఒక అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేశారట.  ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో ‘రంగస్థలం’లో తాను పోషించిన చిట్టిబాబు పాత్ర కంటే మరింత చక్కటి పాత్ర పోషిస్తున్నట్లు తాజాగా చెర్రీ వెల్లడించారు.  ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి మొదలయ్యే అవకాశం ఉంది.


Read Also: ఓ మై గాడ్, ఆస్కార్ వేడుక టికెట్ల కోసం రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్‌ అంత ఖర్చుపెట్టారా?