Prabhas Salaar 2 Update: ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ప్రభాస్ కటౌట్‌కు తగిన హిట్ పడలేదు. ఫ్యాన్స్ అంతా తన నుండి ఒక మాస్, కమర్షియల్ మూవీ వస్తుందని ఎదురుచూస్తున్న సమయంలోనే ‘సలార్’ గురించి ప్రకటన వచ్చింది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. అలా గతేడాది చివర్లో విడుదలయిన ‘సలార్’ చాలాకాలం తర్వాత ప్రభాస్ రేంజ్‌కు తగిన హిట్‌ను సొంతం చేసుకుంది. థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు ప్రకటించగా.. తాజాగా దీనిపై ఒక ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది.


‘కల్కి’ వల్ల కన్ఫ్యూజన్..


ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా మరో మూడు ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటన్నింటి మధ్యలో ‘సలార్ 2’కు ప్రభాస్ ఎప్పుడు కాల్ షీట్స్‌ను అందించగలడా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 AD' రిలీజ్ డేట్‌పై కూడా కన్ఫ్యూజన్ ఉండడంతో తన తరువాతి ప్రాజెక్ట్స్ ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ‘కల్కి 2898 AD' రిలీజ్ డేట్‌లో మార్పులు జరగడం వల్ల ప్రభాస్.. తన లైనప్‌ను మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది.


వచ్చే ఏడాదిలోపు..


‘కల్కి 2898 AD' అనేది కేవలం ఒక భాగంలా కాకుండా దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని నాగ్ అశ్విన్ ఇప్పటికే హింట్ ఇచ్చాడు. అయితే ‘కల్కి 2’ విడుదల అవ్వకముందే ‘సలార్ 2’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రభాస్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రశాంత్ నీల్ ఇప్పటికే ‘సలార్ 2’ కోసం అంత సిద్ధం చేశాడట. అంతే కాకుండా లీడ్ రోల్స్‌లో నటించే నటీనటులు కాల్ షీట్స్‌ను కూడా దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తను షూట్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌తో పాటు ‘సలార్ 2’ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లి.. వచ్చే ఏడాదే దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రభాస్ అనుకున్నాడని సినీ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


బ్యాక్ టు బ్యాక్..


2024 మే నెలలోనే ‘సలార్ 2’ను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయ్ కిరంగడూర్.. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం మారుతీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ షూటింగ్‌లో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. అయితే దాంతో పాటు ‘సలార్ 2’ షూటింగ్‌ను కూడా పూర్తిచేయాలని తాను సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ‘రాజా సాబ్’.. 2025 సంక్రాంతికి విడుదల కానుంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ను ప్రారంభించనున్నాడు ప్రభాస్. ఆపై హను రాఘవపూడితో ఒక లవ్ స్టోరీ చేయనున్నాడు. చూస్తుంటే మరో మూడేళ్ల వరకు ప్రభాస్ డేట్స్ ఖాళీగా లేవని అనిపిస్తోంది.



Also Read: నా బాధ చూడ‌లేక నా ఫ్రెండ్స్ అంతా అలా చేశారు, అందుకు రెండేళ్లు శ్రమించా: న‌వ‌దీప్