Prabhas Kalki 2 Movie Shooting Update : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్'తో ఈ సంక్రాంతికి సందడి చేశారు. డార్లింగ్ ఫ్యాన్స్‌ను మూవీ కొంత నిరాశపరిచినా హారర్ ఫాంటసీలో వింటేజ్ ప్రభాస్‌ను చూసిన ఫ్యాన్స్, ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఆయన సీక్వెల్స్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో నాగ్ అశ్విన్ విజువల్ వండర్ 'కల్కి 2' ఒకటి. తాజాగా దీనిపై బిగ్ అప్డేట్ వచ్చింది.
షూటింగ్ ఎప్పటి నుంచంటే?
'కల్కి 2898 AD'కి కొనసాగింపుగా రాబోతున్న చిత్రం 'కల్కి 2'. గతేడాది ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని పలు రూమర్స్ వచ్చినా అది ట్రాక్ ఎక్కలేదు. దీంతో ఈ మూవీ సీక్వెల్‌పై ఫ్యాన్స్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ప్రభాస్ 'ఫౌజీ', 'స్పిరిట్' మూవీస్ షూటింగ్స్‌లో బిజీగా ఉండగా... 'కల్కి 2' షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మార్చి తర్వాత డార్లింగ్ ప్రభాస్ సెట్స్‌లోకి అడుగుపెడతారని సమాచారం. ఇందుకు తగ్గట్లుగానే ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
Also Read : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
2024లో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా 'కల్కి 2898 AD' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహాభారతం బ్యాక్ డ్రాప్‌గా సాగిన స్టోరీలో ప్రభాస్ భైరవగా, కర్ణగా రెండు పాత్రల్లో కనిపించారు. ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, దిశా పటానీ, మృణాల్ ఠాకూర్, శోభన, విజయ్ దేవరకొండ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. అశ్వినీదత్ నిర్మించారు.
అయితే, అనుకోని కారణాలతో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్‌ను సీక్వెల్ ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. మరి ఆమె రోల్ ఎవరు చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఫస్ట్ పార్ట్‌ను మించి సెకండ్ పార్ట్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మొదటి భాగంలో ఓ విజువల్ వండర్‌నే నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించారు. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ దాదాపు రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు రెండో పార్ట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.