మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' ఫ్లాప్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యారు. సంక్రాంతికి విడుదలైన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో భారీ హిట్ కొట్టారు. బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను ఈ సినిమా క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నాలుగు రికార్డులు క్రియేట్ చేసింది. అవి ఏమిటో చూద్దాం.
నార్త్ అమెరికాలో చిరు హైయ్యస్ట్ గ్రాసర్!నార్త్ అమెరికాలో 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా కలెక్షన్స్ 2.5 మిలియన్ డాలర్స్ దాటాయి. అంతే కాదు మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో నార్త్ అమెరికా ఆల్ టైం హైయ్యస్ట్ గ్రాసింగ్ ఫిలిం కింద ఈ సినిమా రికార్డు సృష్టించింది.
Also Read: Bheems Bollywood Debut: బాలీవుడ్ వెళుతున్న భీమ్స్... అక్షయ్ కుమార్ సినిమాకు సంగీత దర్శకుడిగా
విడుదలైన అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్!'మన శంకర వరప్రసాద్ గారు' క్రియేట్ చేసిన మరొక రికార్డు ఏమిటి అంటే... ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయింది. డిస్ట్రిబ్యూటర్లకు కొన్న అమౌంట్ కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి వాళ్లకు లాభాలు అందించడం మొదలు పెట్టింది.
Also Read: ఇస్లాంకు వ్యతిరేకంగా 'ద్రౌపది 2' తీశారా? హిందువుల ఊచకోత, ఆలయాల ధ్వంసం వేటికి సంకేతం?
రీ ఎంట్రీ తర్వాత చిరుకు మూడో సంక్రాంతి హిట్!'ఖైదీ నెంబర్ 150' సినిమాతో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా సంక్రాంతికి విడుదల అయ్యి భారీ విజయం సాధించింది. అలాగే బాబీ దర్శకత్వంలో నటించిన 'వాల్తేరు వీరయ్య' కూడా సంక్రాంతి రిలీజ్. ఆ సినిమా కూడా విడుదల విజయం సాధించింది. ఇప్పుడు 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో... రీ ఎంట్రీలో సంక్రాంతి బరిలో చిరంజీవి తర్వాత ముచ్చటగా మూడో విజయాన్ని అందుకున్నారు.
నాలుగోసారి 100 కోట్ల షేర్ కొట్టిన చిరంజీవి!సంక్రాంతికి విడుదలైన చిరంజీవి మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల షేర్ అందుకున్నాయి. వీటితో పాటు 'సైరా నరసింహా రెడ్డి' కూడా 100 కోట్ల షేర్ అందుకుంది. సంక్రాంతికి రికార్డు ఏమిటంటే... 'మన శంకర్ వరప్రసాద్ గారు' ఐదు రోజులకే 100 కోట్ల షేర్ సాధించడం. ఆరు రోజుల్లో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావడం. ఆల్రెడీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 260 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఆ ఘనత కేవలం ఆరు రోజుల్లో చేరుకుంది. లాంగ్ రన్ కంప్లీట్ అయ్యేసరికి 500 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని సమాచారం.