రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఫాంటసీ హారర్ కామెడీ 'ది రాజా సాబ్'. ఈ సినిమా విడుదల అయినప్పుడు అభిమానుల్లో చాలా క్రేజ్, బజ్ ఏర్పడింది. ఫ్యాన్స్ కూడా 'ది రాజా సాబ్' సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. కానీ సినిమా విడుదల అయిన వెంటనే పరిస్థితి అంతా తారుమారైంది. నిజం చెప్పాలంటే... విమర్శకుల నుంచి సినిమాకు ప్రతికూల సమీక్షల వచ్చాయి. ప్రజలు కూడా సినిమాను చూసేందుకు పెద్దగా రాలేదు. తొమ్మిది రోజుల్లో సినిమా వసూళ్లు తగ్గాయి. ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర 'ది రాజా సాబ్' ఎంత కలెక్షన్ సాధించిందో తెలుసుకోండి.
తొమ్మిదో రోజు 'ది రాజా సాబ్' బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంతంటే?
The Raja Saab 9th Day Collection: కలెక్షన్స్ వివరాలు వెల్లడించే Sacnilk ప్రకారం... 'ది రాజా సాబ్' 9వ రోజున బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 3 కోట్ల రూపాయలు మాత్రమే. తొమ్మిదో రోజున సినిమా వసూళ్ల ఎంత అనేది ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. కానీ సినిమా తొమ్మిదవ రోజున 3 కోట్లు (ఇండియాలో నెట్ కలెక్షన్) సంపాదించి ఉంటే... ఇప్పటి వరకు ఈ సినిమా మొత్తం 136.75 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా 400 కోట్ల బడ్జెట్‌తో రూపొందిందని సమాచారం. ఆ విధంగా చూస్తే, సినిమా బడ్జెట్‌ను రాబట్టే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంది.
Also Read: Tamannaah Bhatia: యూట్యూబ్‌లో తమన్నా ఐటమ్ నంబర్ రికార్డులు... దుమ్ము రేపిన 'ఆజ్ కీ రాత్'
The Raja Saab Total Collection Worldwide: 'ది రాజా సాబ్' సినిమాకు ప్రీమియర్ షోల ద్వారా 9.15 కోట్లు వసూళ్లు వచ్చాయి. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినదే ఎక్కువ. ఆ తర్వాత... సినిమా విడుదలైన మొదటి రోజున 53.73 కోట్లు వసూలు చేసింది. తెలుగులో 47 కోట్లు, హిందీలో 6 కోట్లు, తమిళంలో 55 లక్షలు, కన్నడలో 10 లక్షలు, మలయాళంలో 10 లక్షలు వసూలు చేసింది.
Also Read: టబుతో రిలేషన్షిప్... ఆమెతో వన్ నైట్ స్టాండ్... హీరోయిన్‌ను వదిలేసి ఆవిడతో పెళ్లి?
రెండవ రోజున సినిమా 26 కోట్లు వసూలు చేసింది. మూడవ రోజున సినిమా 19.1 కోట్లు వసూలు చేసింది. సినిమా వసూళ్ల సంఖ్య తగ్గుతూనే ఉంది. నాల్గవ రోజున సినిమా 6.6 కోట్లు వసూలు చేసింది. ఐదవ రోజున సినిమా 4.8 కోట్లు వసూలు చేసింది. ఆరవ రోజున సినిమా 5.35 కోట్లు వసూలు చేసింది. ఏడవ రోజున సినిమా 5.5 కోట్లు వసూలు చేసింది. ఎనిమిదవ రోజున సినిమా 3.5 కోట్లు వసూలు చేసింది. 'ది రాజా సాబ్'కు మారుతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్, సముద్రఖని తదితరులు నటించారు.
Also Read: Sara Arjun: 'యుఫోరియా' ట్రైలర్ లాంచ్‌లో సారా అర్జున్ సందడి... హైదరాబాద్ వచ్చిన 'Dhurandhar' బ్యూటీ