Prabhas's The Raja Saab Teaser Glmipse: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో మోస్ట్ అవెయిటెడ్ మూవీ 'ది రాజాసాబ్'. ఫస్ట్ టైమ్ రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్‌లో ప్రభాస్ నటిస్తుండగా ఆయన ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ సినిమా టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోమవారం టీజర్ రిలీజ్ కావాల్సి ఉండగా.. ఈ లోపే ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది మూవీ టీం. టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేసింది.

గ్లింప్స్.. అంచనాలు మరింత పెంచేసిందిగా..

ఇదివరకు ఎన్నడూ చూడని డిఫరెంట్ రోల్‌లో ప్రభాస్ నటిస్తుండగా భారీ హైప్ క్రియేట్ అవుతోంది. తాజాగా రిలీజ్ అయిన టీజర్ గ్లింప్స్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. ఓ పాడుపడిన భవనంలో కొందరు భయంతో పైకి చూస్తుండగా.. బీజీఎం వేరే లెవల్‌లో ఉంది. అసలు ఆ భవనంలో ఏముంది?, రెబల్ వైబ్ కోసం వెయిటింగ్? అనేలా గ్లింప్స్ ఉంది. 'గాలిలో చల్లదనం.. దారిలో ఓ ఉల్లాసం' అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చారు. పూర్తి టీజర్‌ను సోమవారం ఉదయం 10:52 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

Also Read: తప్పును సరిచేసిన బన్నీ - బట్టిని మరిచిన బాలయ్య... 'గద్దర్ అవార్డ్స్'లో వైరల్ మూమెంట్స్‌

ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు హీరోయిన్లు

ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తుండగా.. ముగ్గురు హీరోయిన్లు గ్లింప్స్‌లో ఒకటే ఫ్రేమ్‌లో కనిపించారు. ముగ్గురూ ఆందోళనతో చూస్తుండడం ఆసక్తి పెంచేసింది. ఇప్పటికే ప్రభాస్ లుక్స్ అదిరిపోయాయి. సోమవారం ఈవెంట్‌లో ఇంకా చాలా సర్‌ప్రైజెస్ ఉన్నాయని తెలుస్తోంది. మూవీ కోసం వేసిన ఓ భారీ సెట్‌ను ఇందులో చూపిస్తారనే ప్రచారం సాగుతోంది.

రాజులకే రాజు మా ప్రభాస్ రాజు

'రాజులకే రాజు మా ప్రభాస్ రాజు'.. ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కు మించి ఒక శాతం ఎక్కువే ఇస్తామని ఇదివరకే డైరెక్టర్ మారుతి ఓ ఈవెంట్‌లో చెప్పారు. రొమాంటిక్ హారర్ కామెడీ జానర్‌లో డార్లింగ్ ఎలా ఉండబోతున్నారో అని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే.. రెండు రోజుల క్రితం టీజర్ విజువల్స్ కొన్ని ఆన్‌లైన్‌లో లీక్ కావడం ఆందోళన కలిగించింది. వాటిని తొలగించే పనిలో మూవీ టీం పడింది. ఈ కంటెంట్ షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. సౌషల్ మీడియా అకౌంట్స్ బ్యాన్ చేస్తామని మేకర్స్ హెచ్చరించారు.

ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సంజయ్ దత్, రిద్ధికుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.