Producer SKN About Prabhas's The Raja Saab Teaser: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబోలో అవెయిటెడ్ మూవీ 'ది రాజాసాబ్'. రొమాంటిక్ కామెడీ హారర్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోన్న ఈ సినిమా టీజర్ కోసం అటు డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు ఇటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా.. మారుతి సన్నిహితుడు, 'బేబి' మూవీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ దీనిపై బిగ్ అప్‌డేట్ ఇచ్చారు.
టీజర్ ఎప్పుడంటే?
తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఎస్కేన్.. ప్రభాస్ ''ది రాజాసాబ్' మూవీ టీజర్ ఎందుకు ఆలస్యం అవుతుంది?' అంటూ ఎదురైన ప్రశ్నకు టీజర్ త్వరలోనే వస్తుందని చెప్పారు. 'పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత విశ్వప్రసాద్ బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్‌గా ది రాజాసాబ్ రూపొందిస్తున్నారు. రెండు వారాల్లోనే టీజర్ రిలీజ్ అవుతుంది.' అంటూ అప్‌డేట్ ఇచ్చారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఈ మూవీలో ప్రభాస్‌ను ఇదివరకు ఎన్నడూ చూడని న్యూ లుక్‌లో చూడబోతున్నారని మారుతి ఇదివరకే ప్రకటించారు. ఇప్పటికే గ్లింప్స్ ఆకట్టుకోగా.. టీజర్ సైతం రెడీ అయిపోయిందనే వార్తలు వచ్చాయి. అయితే.. డైరెక్టర్ మారుతి 'రాజాసాబ్' టీజర్ రఫ్ కట్ చూపించారని.. అది నెవర్ బిఫోర్ అనేలా ఉందనే టాక్ వినిపించింది. ఆ తర్వాత మూవీ టీం నుంచి టీజర్ రిలీజ్‌పై ఎలాంటి అప్‌డేట్స్ లేవు. తాజాగా.. రెండు వారాల్లోనే టీజర్ వస్తుందనే క్లారిటీ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కు అనుగుణంగా ఈ టీజర్ ఉంటుందనే మారుతి ఇదివరకే స్పష్టం చేశారు.
Also Read: 'ఏస్' రివ్యూ: విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్... యోగిబాబు కామెడీ గట్టెక్కించిందా? మూవీ హిట్టేనా?
మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‍పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ నెగిటివ్ రోల్ చేస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తారని ఇదివరకూ ప్రకటించినా అది సాధ్యం కాలేదు.
సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతుందనే టాక్ వినిపిస్తోంది. మూవీకి 3 గంటల 30 నిమిషాల రన్ టైం వచ్చిందని.. దాన్ని తగ్గించే పనిలో డైరెక్టర్ మారుతి ఉన్నారని తెలుస్తోంది. అలాగే.. 3 పాటల షూటింగ్ కూడా ఇంకా మిగిలే ఉందని సమాచారం. ఈ క్రమంలో ఈ మూవీ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
షూటింగ్‌లో సంజయ్ దత్
'ది రాజాసాబ్' మూవీ షూటింగ్ కోసం బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ ఇటీవలే హైదరాబాద్ వచ్చారని తెలుస్తోంది. సంజయ్ సహా కీలక నటీనటుల మీద మారుతి ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకు హైదరాబాద్ నగర శివారులోని అజీజ్ నగర్‌లో ఓ స్టూడియో ఉండగా.. అందులో తాజా షెడ్యూల్ జరుగుతుందని సమాచారం.
మరోవైపు, ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ', ఆ తర్వాత 'కల్కి' సీక్వెల్, 'సలార్' సీక్వెల్స్ ఉన్నాయి. ఇదే సమయంలో సందీప్ వంగా 'స్పిరిట్' మూవీ కూడా లైనప్‌లో ఉంది.