తెలుగు ప్రేక్షకులకు తృప్తి డిమ్రి (Tripti Dimri) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రణబీర్ కపూర్ 'యానిమల్'తో సౌత్ ప్రేక్షకుల్లోనూ ఈ బాలీవుడ్ భామ పాపులర్ అయ్యారు. ఆ సినిమాకు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకుడు. 'యానిమల్' తర్వాత ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ఆయన దర్శకత్వంలో 'స్పిరిట్' తెరకెక్కుతోంది. ఆ సినిమా షూటింగ్ కోఠిలో జరుగుతోంది. హీరోయిన్ కూడా ఆ విషయమై హింట్ ఇవ్వడం విశేషం.
ఛాయ్ బిస్కెట్ & తృప్తి డిమ్రి!Spirit Movie Shooting Latest Update: ఇటీవల పూజతో 'స్పిరిట్'ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం భాగ్య నగరంలో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. కోఠిలోని మహిళా కళాశాల (Koti Womens College)లో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఆ షూటింగులో తృప్తి జాయిన్ అయ్యారు. అయితే ఆ విషయాన్ని ఆవిడ నేరుగా చెప్పలేదు. ఓ హింట్ ఇచ్చారు.
Also Read: ఆడపడుచు & అత్తమామలతో సమంత... రాజ్ నిడిమోరు సిస్టర్ శీతల్ హార్ట్ టచింగ్ పోస్ట్
హైదరాబాద్ సిటీ అంటే చాలా మందికి మొదటగా గుర్తుకు వచ్చే ఫుడ్ ఐటమ్స్‌లో ఛాయ్ బిస్కెట్ ఒకటి. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఛాయ్ బిస్కెట్ ఫోటోలను తృప్తి షేర్ చేశారు. అదీ సంగతి!
ఓటీటీ అమ్మేశారు... నో లుక్!'స్పిరిట్' సెట్స్ మీదకు వెళ్ళడానికి ముందు ఓటీటీ రైట్స్ అమ్మేశారు. అది ఓ రికార్డ్ అని చెప్పాలి. ఈ సినిమా పూజకు ప్రభాస్ వచ్చినప్పటికీ లుక్ రివీల్ చేయలేదు. ఈ సినిమా షూటింగ్ అయ్యే వరకు లుక్ రివీల్ చేయవద్దని హీరోని దర్శకుడు రిక్వెస్ట్ చేశారట. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది.
Also Read: Akhanda 2 First Review: 'అఖండ 2'కు తమన్ రివ్యూ... అనిరుధ్ రేంజ్‌లో ఎమోజీలతో హైప్ పెంచాడుగా!