కోలీవుడ్ కథానాయకుడు కార్తి (Hero Karthi)కి తెలుగులోనూ కొందరు స్టార్ హీరోలతో సమానమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయన సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి భారీ ఎత్తున విడుదల చేస్తుంటారు. ఆయన హీరోగా నటించిన తాజా తమిళ సినిమా 'వా వాతియార్'. తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ నెల 12న 'అన్నగారు వస్తారు'గా రానుంది. ఇందులో మొదటి పాట 'అన్నగారు'ను తాజాగా విడుదల చేశారు. ఆ సాంగ్ లిరిక్స్ చూస్తే...
రెట్రో స్టైల్ ట్యూన్...కార్తీ స్టైలిష్ లుక్స్ & ఎనర్జీ! 'అన్నగారు వస్తారు' సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు. ఆయన అందించిన బాణీకి తెలుగులో రాకేందు మౌళి సాహిత్యం అందించారు. ఎస్పీ అభిషేక్, హరిప్రియ పాడారు. ఈ ట్యూన్ రెట్రో స్టైల్ లో ఉంది. లిరికల్ వీడియోలో కార్తీ లుక్స్ స్టైలిష్ గా ఉన్నాయి. ఆయన ఎనర్జీతో స్టెప్పులు వేసినట్టు అర్థం అవుతోంది. మరి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేసిన ఈ సాంగ్ లిరిక్స్ చూస్తే...
అ.................న్న...............గా.................రూ...............అన్నగారూ....... (2)
కోరస్:అ.................న్న...............గా.................రూ...............అన్నగారూ....... (2)
చరణం 1:ఆల్రెడీ నేను రిచ్ కిడ్డు...పక్కకెళ్లు!పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేశా...పక్కకెళ్లు!
Also Read: ఆడపడుచు & అత్తమామలతో సమంత... రాజ్ నిడిమోరు సిస్టర్ శీతల్ హార్ట్ టచింగ్ పోస్ట్
రాజమౌళికి ఫోన్ చేసి నా మీద... బయోపిక్ ఒకటి తీయమంటున్నా...పక్కకెళ్లు! (2)
పక్కకెళ్లు... పక్కకెళ్లు... పక్కకెళ్లు
అన్నగారూ.......అన్నగారూ ఊఊఊఊ......
'అన్నగారు వస్తారు'లో కార్తీ సరసన కృతి శెట్టి కథానాయికగా నటించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకం మీద కె.ఇ. జ్ఞానవేల్ రాజా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. నలన్ కుమారస్వామి దర్శకుడు.
Also Read: Akhanda 2 First Review: 'అఖండ 2'కు తమన్ రివ్యూ... అనిరుధ్ రేంజ్‌లో ఎమోజీలతో హైప్ పెంచాడుగా!
కార్తీ, కృతి శెట్టి జంటగా నటించిన 'అన్నగారు వస్తారు'లో సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జార్జ్ సి. విలియమ్స్, కూర్పు: వెట్రే కృష్ణన్, సంగీతం: సంతోష్ నారాయణన్.