Prabhas On Biker: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'బైకర్'. ఏప్రిల్ 3న థియేటర్లలోకి వస్తుంది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్... ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడీ ట్రైలర్ రెబల్ స్టార్ ప్రభాస్ మనసు కూడా దోచుకుంది. ఆయన ఈ సినిమాకు సపోర్ట్ ఇచ్చారు.
ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్!Prabhas Reviews Biker Trailer: ''నాకు 'బైకర్' ట్రైలర్‌లో వైబ్ నచ్చింది. చాలా ఎంగేజింగ్‌గా ఉంది. శర్వానంద్, యువి క్రియేషన్స్, 'బైకర్' చిత్ర బృందానికి బెస్ట్ విషెస్. ఏప్రిల్ 3న భారీ విజయం సాధించాలని ఆశిస్తున్నాను'' అని ప్రభాస్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.
Also Read: Tovino Thomas: ఎన్టీఆర్ - నీల్ 'డ్రాగన్'లో నటించడం లేదు... కన్ఫర్మ్ చేసిన మలయాళ స్టార్ టోవినో థామస్
ట్రైలర్ విడుదల తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాదు... స్వయంగా ప్రభాస్ బైక్ రైడ్ చేశారు. 'ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్' అంటూ ఓ పోస్ట్ చేశారు. దాంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.
'బైకర్' సినిమాకు 'లూజర్' వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడీ కంకర దర్శకత్వం వహించారు. ఇందులో శర్వానంద్ సరసన మాళవికా శర్మ కథానాయికగా నటించారు. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కీలక పాత్రలో, హీరో తండ్రిగా కనిపించనున్నారు. బైక్ రేసింగ్ నేపథ్యంలో ఓ కుటుంబంలోని మూడు తరాల కథతో సినిమా రూపొందింది. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read: Ram Charan: దేవిని పక్కన పెట్టిన సుక్కు... రామ్ చరణ్ కోసం కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్?
