Prabhas Confirms Baahubali 3 : ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఫస్ట్ మూవీ బాహుబలి. రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ దాదాపు రూ.2,400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పదేళ్ల 'బాహుబలి ది ఎపిక్' పేరిట రెండు పార్టులను కలిపి ఒకే పార్టుగా రిలీజ్ చేశారు. తాజాగా 'బాహుబలి టార్చ్ బేరర్' డాక్యుమెంటరీ సిరీస్ శుక్రవారం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా నెట్ ఫ్లిక్స్ ఓ వీడియోను రిలీజ్ చేసింది.
బాహుబలి 3పై బిగ్ సర్ప్రైజ్
ఇందులో ప్రభాస్, రానా, అనుష్క మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. బాహుబలి 3 ఉంటుందంటూ అఫీషియల్‌గా అనౌన్స్ చేయగా అది వైరల్ అవుతోంది. 'ప్రపంచం ఈ ప్రకటనకు సిద్ధంగా లేదు. మీ అందరి కోసం బాహుబలి మూడో పార్ట్ రానుంది.' అని తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే, మూడో పార్టులో కథ మారుతుందా? దీనికి కంటిన్యూషన్‌గా ఉంటుందా? అనేది మాత్రం సస్పెన్స్.
Also Read : Baahubali Torchbearer OTT : ఓటీటీలోకి బాహుబలి టార్చ్ బేరర్ స్ట్రీమింగ్ - స్పెషాలిటీ ఏంటో తెలుసా?
అనుష్క నవ్వితే...
స్వీటీ అనుష్క నవ్వడం మొదలుపెడితే కనీసం 40 నిమిషాలు ఆగకుండా నవ్వుతుందని చెప్పారు ప్రభాస్. ఆమె రోజూ సెట్స్‌కు వచ్చేటప్పుడు ఈ రోజు నవ్వకూడదని అనుకుంటూ వచ్చేదని... నవ్వితే షూట్ మొత్తం ఆగిపోతుందని ఇంత పెద్ద సెట్ వేసిన నిర్మాతకు నష్టం కలుగుతుందని అనుకునేదని నవ్వులు పూయించారు. ఈ మూవీ తనకు ఎమోషనల్ జర్నీ అని చెప్పారు ప్రభాస్.
గతంలో RRR మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బాహుబలి 3 తీయడానికి అవకాశం ఉందని... అయితే, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి ఆ మూవీ తీస్తానని చెప్పారు. ఇప్పుడు ప్రభాస్, రానాలు కూడా కన్ఫర్మ్ చేయడంతో మహేశ్ బాబు వారణాసి తర్వాత బాహుబలి 3 ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి వారణాసి షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకోగా కాస్త బ్రేక్ ఇచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
