Balakrishna Reaction About Nandi Awards : ఏపీలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి. గురువారం మంగళగిరిలో బాలయ్య, కొరటాల శివ మూవీ NBK112 పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తన మామ బాలయ్య మూవీ ముహూర్తపు షాట్‌కు అల్లుడు లోకేశ్ ఫస్ట్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా నంది అవార్డుల గురించి మాట్లాడారు బాలయ్య.

Continues below advertisement

రెండ్రోజుల్లో నిర్ణయం

నంది అవార్డులపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌తో బాలయ్య మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. నంది అవార్డ్స్ ఇచ్చేద్దామని... దీనిపై రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకుందామని అన్నారు బాలయ్య. 'ఓ ఫంక్షన్ ఏర్పాటు చేసి నంది అవార్డ్స్‌ ప్రకటిద్దాం. రెండ్రోజుల్లో దీనిపై డెసిషన్ తీసుకుందాం. పాతవి పెండింగ్‌లో ఉన్నవి మాత్రం అవార్డులు ఇంటికి పంపించేద్దాం. గతేడాదికి సంబంధించినవి అనౌన్స్ చేద్దాం.' అని మంత్రితో చర్చించారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. 

Continues below advertisement

తెలంగాణలో ఇప్పటికే గద్దర్ అవార్డ్స్ ఇస్తుండగా... ఏపీలోనూ సినీ రంగం బలోపేతం కోసం నంది అవార్డ్స్ ఇవ్వాలనే పునరుద్ధరించాలనే వాదన ఎప్పటి నుంచో ఉంది. రీసెంట్‌గానే ప్రభుత్వం ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ సహా 20 మంది డైరెక్టర్స్‌ను అపాయింట్ చేసింది. సినీ రంగానికి చెందిన ప్రముఖులను ప్రభుత్వం నియమించింది. భరత్ భూషణ్ ఛైర్మన్‌గా మెహర్ రమేష్ వైస్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. నటులు శివాజీ, సుమన్, ఝాన్సీ తదితరులు డైరెక్టర్స్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read : Priyadarshi Idupukayitham : తెలంగాణ నేపథ్యంలో ఇడుపు కాయితం - హీరోగా ప్రియదర్శి... హీరోయిన్‌గా ఫేమస్ ఫోక్ సింగర్

'ఏపీలో అద్భుత లొకేషన్స్'

ఏపీలో జరిగిన ఫస్ట్ సినిమా పూజా కార్యక్రమం 'NBK112' కావడం వెరీ స్పెషల్. మన రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో సినీ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మూవీ పూజా కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్లు చెప్పారు బాలయ్య. 'ప్రస్తుతం అమరావతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. ఏపీలో మిగిలిన ప్రాంతాల్లోనూ సినీ ఇండస్ట్రీని ముందకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పూజా కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశాం.

అందరి సహకారంతోనే ఇండస్ట్రీ ముందుకు సాగుతోంది. ఏపీలో అన్నీ అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ పుట్టిన నేల ఇది. ఈ నేలపై మనం సినిమా రంగాన్ని అభివృద్ధి చేద్దాం. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.' అని చెప్పారు. బాలయ్య నేతృత్వంలో ఇండస్ట్రీని బలోపేతం చేస్తామని చెప్పారు మంత్రి లోకేశ్. ఇండస్ట్రీకి కాబోయే అన్నీ మౌలిక సదుపాయాలు అందిస్తామని...  రాబోయే రోజుల్లో చాలా సినిమాలు ఇక్కడే ప్రారంభం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Also Read : Shanmukh Jaswanth : నిన్న ఆస్పత్రి బెడ్‌పై... ఇవాళ షూటింగ్ సెట్‌లో - షణ్ముఖ్ జస్వంత్ పోస్ట్ వెనుక స్టోరీ ఏంటి?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.