Sandeep Reddy Vanga About Spirit In Recent Interview : టాలీవుడ్ అప్ కమింగ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గత ఏడాది 'యానిమల్' మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. కేవలం మూడు సినిమాలతోనే అగ్ర దర్శకుల సరసన చేరిన ఈయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో 'స్పిరిట్' అనే ప్రాజెక్ట్ చేస్తున్నాడు. సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించబోతున్నాయి. ఈ మూవీ అప్డేట్స్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ‘స్పిరిట్’ స్టోరీ లైన్ ను సందీప్ రెడ్డి వంగ రివీల్ చేశాడు. ఒక నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ కథే 'స్పిరిట్' మూవీ అని ఒక్క మాటలో చెప్పేశాడు. ఇక ఇప్పుడు 'స్పిరిట్' మూవీ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలను లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
'యానిమల్'కి ముందు ప్రభాస్ హాలీవుడ్ మూవీ రీమేక్ చేద్దాం అన్నాడు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. "యానిమల్ మూవీ కంటే ముందు ప్రభాస్ ఓ హాలీవుడ్ సినిమా రీమేక్ చేద్దామని నన్ను సంప్రదించాడు. అప్పుడు ఆ హాలీవుడ్ మూవీ ఒరిజినల్ స్టోరీ మీకు బాగా సూట్ అవుతుందని చెప్పాను. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ‘స్పిరిట్’ కథతో ప్రభాస్ దగ్గరికి వెళ్లాను. ఆ కథ ప్రభాస్ కి బాగా నచ్చింది. ఇప్పటిదాకా స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ 60 శాతం పూర్తయింది. త్వరలోనే మొత్తం కంప్లీట్ చేసి డిసెంబర్లో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ఈ సినిమా పూర్తయిన అనంతరం రణ్ బీర్ కపూర్ తో 'యానిమల్ పార్క్' చేస్తా" అంటూ చెప్పుకొచ్చాడు.
నా గత సినిమాలకి భిన్నంగా 'స్పిరిట్' ఉంటుంది
'స్పిరిట్' మూవీలో ప్రభాస్ మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా సందీప్ రెడ్డి వంగ గత చిత్రాలైన 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాల లాగా ఏమాత్రం ఉండదట. ఇదే విషయాన్ని సందీప్ రెడ్డి వంగ లేటెస్ట్ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు." అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్.. ఈ సినిమాల్లో హీరో ధనిక కుటుంబానికి చెందినవాడు. అత్యంత సంపన్నుడిగా ఉంటాడు. కానీ 'స్పిరిట్' లో అలా కాదు ఇందులో హీరో ఓ సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపిస్తాడు. స్పిరిట్ నా ప్రీవియస్ మూవీస్ లా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంటుంది" అని అన్నాడు.
'స్పిరిట్' లో హీరోయిన్ ఎవరు?
సందీప్ రెడ్డి వంగ 'స్పిరిట్' సినిమా కోసం ఇంకా ఏ హీరోయిన్ ని ఫైనల్ చేయలేదు. అయితే ప్రభాస్ రేంజ్ కటౌట్ కి సూటయ్యే హీరోయిన్ ని తీసుకుంటే బెటర్ అని డైరెక్టర్ భావిస్తున్నాడట. అంతే కాదు ఇప్పటివరకు ప్రభాస్ తో నటించని హీరోయిన్ ని సెలెక్ట్ చేయాలని అనుకుంటున్నాడట. ఈ క్రమంలోనే 'స్పిరిట్' కోసం ముగ్గురు హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో మొదటి పేరు కీర్తి సురేష్.. ఆ తర్వాత రష్మిక మందన, మృణాల్ ఠాగూర్. ఈ ముగ్గురిలో ప్రభాస్ కి జోడిగా ఏ హీరోయిన్ ని సెలెక్ట్ చేస్తారో చూడాలి.
Also Read : ‘గుడ్ నైట్’ టైటిల్ మాదే, మేమే వాళ్లకు ఇచ్చాం.. ‘డియర్’ కథ వేరే - ఐశ్వర్య రాజేష్