Fauzi Makers Issues Strong Warning About Leaked Pics : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 'సీతారామం' ఫేం హను రాఘవపూడి కాంబో అవెయిటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ'. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... డార్లింగ్‌తో పాటు మూవీ టీం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా, సెట్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ కావడంతో ఆందోళన నెలకొంది.
స్ట్రాంగ్ వార్నింగ్
ఇవి మొదట AIతో రూపొందించిన ఫోటోలు అని అనుకున్నారు. కానీ, అవి నిజమైనవే అని తేలడంతో మూవీ టీం రియాక్ట్ అయ్యింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చెయ్యొద్దని అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. సినిమాను థియేటర్లోనే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలంటూ ట్వీట్ చేశారు.
'ఫౌజీ సెట్స్ నుంచి లీకైన కొన్ని పిక్స్ ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ లీక్స్ మేము ఎంతో గొప్పగా, జాగ్రత్తగా నిర్మిస్తున్న అనుభవాన్ని దెబ్బ తీస్తున్నాయి. వెండి తెరపై రాబోయేది చాలా గొప్పగా ఉంటుంది. లీక్ అయిన కంటెంట్‌పై చర్చ కానీ, షేర్ చెయ్యొద్దని ప్రతీ ఒక్కరినీ కోరుతున్నాం. దీనిపై కంప్లైంట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం.' అని వార్నింగ్ ఇచ్చింది.
Also Read : టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
ఫ్యాన్స్‌కు డైరెక్టర్ రిక్వెస్ట్
ఫోటోస్ లీక్ అయిన క్రమంలో డైరెక్టర్ హను రాఘవపూడి ఫ్యాన్స్, నెటిజన్లకు ఓ రిక్వెస్ట్ చేశారు. 'మీకు నిజంగా ప్రత్యేక అనుభూతి అందించడానికి మేము మా హృదయాలను ధారపోశాం. దయచేసి లీక్స్‌తో ఆ మ్యాజిక్ పాడు చెయ్యొద్దని అందరినీ వినయ పూర్వకంగా కోరుతున్నా. ఆ థ్రిల్, ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండాలో అలాగే థియేటర్లలో అందరం కలిసి అనుభవిద్దాం.' అని అన్నారు.
ఈ మూవీని స్వాతంత్ర్యం ముందు 1930 కాలంలో జరిగిన ఘటనల ఆధారంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఓ బెటాలియన్ నాయకుడిగా, పవర్ ఫుల్ సైనికుడిగా కనిపించనున్నారు. తనకు ఇన్‌స్పైర్ కలిగించిన కొన్ని రియల్ లైఫ్ ఘటనలను ఇందులో చూపించనున్నట్లు డైరెక్టర్ హను ఇదివరకే తెలిపారు. రెండు పార్టులుగా మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
రిలీజ్ ఎప్పుడంటే?
ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తుండగా... అనుపమ్ ఖేర్, భాను చందర్, మిథున్ చక్రవర్తి, జయప్రద తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తుండగా... ఈ ఏడాది డిసెంబర్ 4న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
