Prabhas's Fauji Leaked Picture Connected With Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ అవెయిటెడ్ మూవీ 'ఫౌజీ'. 'సీతారామం' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి ప్రభాస్ వింటేజ్ లుక్ ఇదేనంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో లీక్ కాగా క్షణాల్లోనే వైరల్ అయ్యింది. అదే కాకుండా లుక్స్, వీడియో అంటూ కొన్ని ఫోటోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. 

అసలు నిజం ఏంటంటే?

ప్రభాస్ వింటేజ్ లుక్ ఇదేనంటూ లీక్ అయిన పిక్ ఒరిజినల్ మూవీ లోనిది కాదని తేలింది. ఈ పిక్ రాధే శ్యామ్ నుంచి ఓ స్టిల్ తీసుకుని ఏఐ సాయంతో దాన్ని మార్చి 'ఫౌజీ' లుక్ అంటూ నెట్టింట రిలీజ్ చేశారు. అది నిజమే అనుకుని డార్లింగ్ ఫ్యాన్స్ షేర్ చేయడంతో ట్రెండింగ్ అయ్యింది. ఆ పిక్‌నే ఫ్యాన్స్ కూడా తమకు తోచిన విధంగా ఇంట్రెస్టింగ్‌గా మార్చుకుంటున్నారు. తాజాగా ఏఐ ఫోటో అని తెలిసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. టెక్నాలజీ వల్ల ఏది రియల్ ఏది ఫేక్ అని కూడా తెలుసుకోలేకపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: 'వార్ 2' రిలీజయ్యాక ఫస్ట్‌ టైమ్‌ పబ్లిక్ మీటింగ్‌కు నాగవంశీ... మాటల్లో మార్పు - ధైర్యం ఇచ్చిన మలయాళ డబ్బింగ్ మూవీ

ప్రస్తుతం ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా మారారు. ఇప్పటికే 'ఫౌజీ' మూవీ షూటింగ్ 50 శాతం పూర్తి కాగా... వచ్చే ఏడాది ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మూవీలో ప్రభాస్ సరసన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటే బాలీవుడ్ యాక్టర్స్ అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, సీనియర్ హీరోయిన్ జయప్రద కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. 1940ల కాలం నాటి బ్యాక్ డ్రాప్‌గా స్టోరీ సాగనుండగా... ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

అదే ఫోటో

షూటింగ్ టైంలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌గా స్టైలిష్ వింటేజ్ లుక్‌లో ఉన్నట్లుగా ఫోటో షేర్ చేయగా... అది 'ఫౌజీ' ఫోటోనే అంటూ ట్రెండ్ చేశారు. తాజాగా అది ఏఐతో చేసిన ఫోటో అని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు, ఇలాంటి లీక్స్‌పై మూవీ టీం ఆగ్రహం వ్యక్తం చేసింది. సెట్స్ నుంచి ఓ ఫోటో బయటకు వచ్చిన విషయం తమ దృష్టికి వచ్చిందని... ఇలాంటి లీక్స్ తమ నైతికతను దెబ్బ తీస్తాయని తెలిపింది. 'లీక్ అయ్యాయంటూ వచ్చిన ఫోటోస్‌ను ఎవరూ షేర్ చేయొద్దు. అనధికారికంగా ఈ మూవీ ఫోటోస్ షేర్ చేస్తే వారి అకౌంట్స్ రిమావ్ చేయడమే కాకుండా అది సైబర్ నేరంగా పరిగణిస్తాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.' అని చిత్ర నిర్మాణ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. ఇక ప్రభాస్ మరో మూవీ 'ది రాజా సాబ్' కూడా విడుదలకు రెడీ అవుతోంది.