Producer Naga Vamsi Speech In Kotha Lokah Chapter 1 Success Event: రీసెంట్‌గా వచ్చిన 'వార్ 2' రిజల్ట్ తర్వాత ప్రొడ్యూసర్ నాగవంశీపై ట్రోలింగ్ సాగిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్‌గా అంత సక్సెస్ కాలేదు. దీంతో ఆయన దుబాయ్ వెళ్లిపోయారని కొందరు... ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేశారని మరికొందరు ట్రోల్స్ చేశారు. దీనిపై 'డిసప్పాయింట్ చేసినందుకు సారీ. ఇంకో 10 - 15 ఏళ్లు ఉంది.' అంటూ కౌంటర్ కూడా ఇచ్చారు.
తాజాగా... చాలా రోజుల తర్వాత ఆయన పబ్లిక్ ఈవెంట్‌లో కనిపించారు. 'కొత్త లోక చాప్టర్ 1: చంద్ర' మూవీని ఆయన తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేయగా బుధవారం నిర్వహించిన సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. దీంతో 'కొత్త లోక' రిజల్ట్ ఆయనకు జోష్ ఇచ్చిందంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ధైర్యంగా థియేటర్‌కు వెళ్లండి
ఈ మూవీని కచ్చితంగా చూడాలని... మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని నాగవంశీ తెలిపారు. 'ఈ మూవీ తెలుగు ఆడియన్స్‌కు మేం అనుకున్నంత రీచ్ కాలేదు. ప్రమోట్ చేసేందుకు మాకు టైం లేదు. తెలుగు ఆడియన్స్‌కు ఓ మంచి మూవీ వచ్చింది. టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్ మూవీ. అందరూ చాలా బాగా నటించారు. అందరూ తప్పకుండా చూడండి అని చెప్పడానికే సక్సెస్ ఈవెంట్ పెట్టి దుల్కర్‌ను పిలిచాం. ఈసారి రిలీజ్ అయిన సినిమాను చూసి కాన్ఫిడెంట్‌గా చెబుతున్నా. థియేటర్స్‌కు ధైర్యంగా వెళ్లండి.' అంటూ చెప్పారు.
Also Read: మళ్లీ తెరపైకి హీరో రాజ్ తరుణ్ కాంట్రవర్శీ - అనుచరులతో దాడి చేశారంటూ కంప్లైంట్
ఈ మూవీని తెలుగులో సరిగ్గా ప్రమోట్ చేసుకోలేకపోయినట్లు నాగవంశీ తెలిపారు. ''కొత్త లోక చాప్టర్ 1' టీజర్‌ను ఆ మూవీలో భాగమైన నా ఫ్రెండ్ నాకు పంపించారు. టీజర్ చూసే తెలుగులో నేను విడుదల చేస్తానని చెప్పా. ప్రమోట్ చేయడానికి మాకు ఎక్కువ టైం లేదు. అందుకే తెలుగు ఆడియన్స్ ఎక్కువ మంది చూడలేదు. ఈ మూవీ టెక్నికల్ పరంగా ఉన్నతమైన మూవీ. అది తెలిపేందుకే ఈవెంట్ పెట్టాం. ఓ మంచి సినిమాను అందరూ చూడాలి.' అని చెప్పారు.
ప్రేమలు ఫేం నస్లెన్, కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ 'కొత్త లోక చాప్టర్ 1: చంద్ర'. కల్యాణి హలో, చిత్ర లహరి వంటి మూవీస్‌తో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. ఈ మూవీకి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించగా... ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ తన నిర్మాణ సంస్థ 'వేఫేరర్ ఫిల్మ్స్' బ్యానర్‌పై నిర్మించారు. దుల్కర్ సల్మాన్, టొవినో థామస్ కీలక పాత్రలు పోషించారు. హీరోయిన్‌కు సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది. వాటితో ఆమె ఏం చేసింది? అనేదే ప్రధాన కథాంశంగా మూవీని తెరకెక్కించారు. తెలుగు రాష్ట్రాల్లో మూవీని నాగవంశీ రిలీజ్ చేశారు. తాజాగా ఈ మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.