Prabhas's Spirit OTT Deal Locked With Big Number : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతోన్న పాన్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ స్పిరిట్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... అప్పుడే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రాజెక్ట్ నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగినట్లు ఫిలింనగర్ ఇన్ సైడ్ వర్గాల టాక్.

Continues below advertisement

భారీ డీల్... అన్ని కోట్లా?

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌తో సందీప్ వంగా మూవీ అంటేనే మామూలు క్రేజ్ కాదు. అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ భారీ హైప్ క్రియేట్ అవుతుండగా... టీజర్‌తో అది పదింతలైంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ కనిపించనున్నారు. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'నెట్ ఫ్లిక్స్' రూ.250 కోట్ల భారీ డీల్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. 

Continues below advertisement

కేవలం డిజిటల్ రైట్స్‌కే ఈ స్థాయిలో డీల్ కుదిరితే ఇంక థియేట్రికల్ రైట్స్‌కు ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో మూవీ రిలీజ్ రైట్స్ ప్రముఖ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగాా తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : పిల్లలను మట్టిలో ఆడనిస్తా - అయ్యప్ప దీక్షతో మార్పు... రామ్ చరణ్ ఇంటర్వ్యూ హైలెట్స్

ఈ మూవీలో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, సీనియర్ నటి కాంచన తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నాారు.  టీ సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రభాస్ లుక్, స్పెషల్ వీడియో వేరే లెవల్‌లో ఉన్నాయి. పోలీస్ కథతో పాాటు మాఫియా బ్యాగ్రౌండ్‌ను కూడా చూపించనున్నట్లు తెలుస్తోంది.

ఓ పోలీస్ అధికారి అయి ఉండి ప్రభాస్ జైలుకు ఎందుకు వెళ్లాడు? అనేదే ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, చైనీస్, కొరియన్ సహా ఇతర ఫారిన్ లాంగ్వేజీల్లో మూవీ రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.