సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా 'కూలీ' (Coolie Movie). లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ఒక స్పెషల్ సాంగ్ చేశారు. ఆ సాంగ్ రిలీజ్ డేట్ అండ్ టైం అనౌన్స్ చేశారు. 

గురువారం ఉదయం 11 గంటలకు! 'కూలి' సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసిన విషయం కొన్ని రోజుల క్రితం లీక్ అయ్యింది. అయితే చిత్ర బృందం ఆ విషయాన్ని అధికారికంగా ఏమీ చెప్పలేదు. ఉన్నట్టుండి బుధవారం సాయంత్రం అనూహ్యంగా పూజ హెగ్డే ప్రీ లుక్ రిలీజ్ చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు కూలీలో బుట్ట బొమ్మ చేసిన ప్రత్యేక గీతాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పేర్కొంది.

Also Readతెలుగులో విడుదలకు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఛావా' రెడీ... ఎన్టీఆర్ డబ్బింగ్‌లో నిజమెంత?

లోకేష్ కనగరాజ్ సినిమాలో ఇదే ఫస్ట్!Pooja Hegde special song in Coolie: 'కూలి'కి ముందు లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా 'విక్రమ్' సినిమాకు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు. అంతకు ముందు దళపతి విజయ్ హీరోగా 'మాస్టర్', 'లియో' సినిమాలు తీశారు అలాగే కార్తీ 'ఖైదీ' కూడా ఆయన దర్శకత్వం వహించిన చిత్రమే. ఆ సినిమాలలో స్పెషల్ సాంగ్స్ అనేవి లేవు. ఫర్ ద ఫస్ట్ టైం రజనీకాంత్ సినిమా కోసం లోకేష్ కనకరాజు ఒక స్పెషల్ సాంగ్ కోసం సిట్యువేషన్ క్రియేట్ చేశారు. ఈ సాంగ్ ఎలా ఉంటుందో రేపు తెలుస్తుంది. 

రజనీకాంత్ సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ స్పెషల్ కాన్సంట్రేషన్ చేస్తారని, అటు తమిళ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీ అలాగే ప్రేక్షకులలో ఒక అభిప్రాయం ఉంది. రజని సినిమాలలో అనిరుద్ సాంగ్స్ హైలైట్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ 'జైలర్' సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ 'వా నువ్వు కావాలయ్యా'.‌ మరి, ఈ సారి ఎటువంటి సాంగ్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారో చూడాలి.

Also Read'మజాకా' రివ్యూ: పార్టులు పార్టులుగా చూస్తే కామెడీ సీన్లు ఓకే... మరి సినిమా? సందీప్ కిషన్, రావు రమేష్ కలిసి విసిగించారా? నవ్వించారా?

రజనీ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్న 'కూలీ' సినిమాలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కన్నడ హీరో ఉపేంద్రతో పాటు శృతి హాసన్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవిలో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. బహుశా జూన్ నెలలో సినిమా విడుదల కావచ్చట.