పూజా హెగ్డే తల్లిని చూశారా? ఆమె పేరు లతా హెగ్డే. పబ్లిక్‌లోకి రావడం తక్కువ. కానీ, అమ్మాయికి సంబంధించిన సినిమా వేడుకల్లోనూ కనిపించడం కూడా తక్కువ. ఒకటి లేదా రెండు వేడుకలకు వచ్చినట్టు ఉన్నారు. ఇప్పుడు ఆమె ప్రస్తావన ఎందుకంటే... లేటు వయసులో 'లా' చదవడం మొదలు పెట్టారు. మళ్ళీ పుస్తకాలు పట్టుకున్నారు. అసలు వివరాల్లోకి వెళితే...


పూజా హెగ్డే మదర్ గతంలో ఎంబీఏ చేశారు. ఇప్పుడు 'లా' (న్యాయశాస్త్రం) లో మాస్టర్స్ చేస్తున్నారు. అన్నట్టు... పూజా హెగ్డే ఫాదర్ మంజునాథ్ హెగ్డే కూడా లాయరే. ఈ వయసులో ఆమె 'లా' చేయడం ఎందుకు? అనేది పక్కన పెడితే... లేటు వయసులో చదవాలని అనుకునేవారికి ఆమె స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పవచ్చు. గతంలోనూ కొంత మంది లేటు వయసులో పుస్తకాలు పట్టి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.


Also Read: 'ఆర్ఆర్ఆర్' చూడటానికి ఈ పది కారణాలు చాలా? ఇంకేమైనా కావాలా!?


ఇక పూజా హెగ్డే చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... ఏప్రిల్ 13న 'బీస్ట్' విడుదల కానుంది. అందులో విజయ్ సరసన ఆమె నటించారు. ఏప్రిల్ 29న 'ఆచార్య' విడుదల కానుంది. అందులో రామ్ చరణ్ జోడీగా ఆమె నటించారు. హిందీలో ర‌ణ్‌వీర్‌ సింగ్ తో 'సర్కస్', సల్మాన్ ఖాన్ తో 'కబీ ఈద్ కబీ దీవాలి' చేస్తున్నారు. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ప్రభాస్ జోడీగా ఆమె నటించిన 'రాధే శ్యామ్' ఈ నెలలో విడుదలైన సంగతి తెలిసిందే. 


ఫ్యామిలీతో మాల్దీవులు వెళ్ళినప్పుడు పూజా హెగ్డే పోస్ట్ చేసిన ఫొటో :