హారర్ కామెడీలకు టాలీవుడ్ పెట్టింది పేరు. తమిళం నుంచి 'చంద్రముఖి', 'కాంచన' వంటి హారర్ సినిమాలు తెలుగులో భారీ విజయాలు సాధించినప్పటికీ... హారర్ అంటే ఏమిటో? హారర్ కామెడీ అంటే ఏమిటో? తెలుగు సినిమాలు చూపించాయి. 'ప్రేమ కథా చిత్రం' నుంచి మొదలు పెడితే... అంతకు ముందు, ఆ తర్వాత రీసెంట్ 'మసూద' వరకు బోలెడు హిట్ హారర్ సినిమాలు తెలుగులో ఉన్నాయి. అందులో 'పొలిమేర' ఫ్రాంచైజీ ఒకటి. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీలో మూడో సినిమా అనౌన్స్ చేశారు.
'సత్యం' రాజేష్, కామాక్షితో నెక్స్ట్ లెవల్ హారర్!
'సత్యం' రాజేష్ కథానాయకుడిగా నటించిన 'మా ఊరి పొలిమేర' ఓటీటీలో విడుదల కాగా... తెలుగుతో పాటు ఇతర భాషల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణతో భారీ విజయం సాధించింది. దానికి సీక్వెల్ 'పొలిమేర 2'ను థియేటర్లలో విడుదల చేయగా... భారీ వసూళ్లు సాధించింది. దాంతో ఇప్పుడు 'పొలిమేర' ఫ్రాంచైజీలో మూడో సినిమా అనౌన్స్ చేశారు.
'మా ఊరి పొలిమేర', 'పొలిమేర 2' చిత్రాలకు దర్శకత్వం వహించిన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ 'పొలిమేర 3' చిత్రానికి సైతం దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కూడా 'సత్యం' రాజేష్ హీరో. మొదటి రెండు సినిమాల్లో నటించిన కామాక్షీ భాస్కర్ల మూడో సినిమాలోనూ నటించనున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యిందని దర్శకుడు తెలిపారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్ చూస్తే... 'ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావ్?' అని గెటప్ శ్రీను అడగటం, 'యుద్ధం చేస్తున్నా' అని 'సత్యం' రాజేష్ రిప్లై ఇవ్వడం మూడో పార్ట్ మీద అంచనాలు పెంచాయి. ఇది పాన్ ఇండియా హారర్ సినిమా అని దర్శక నిర్మాతలు తెలిపారు.
'పొలిమేర 3' చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వంశీ నందిపాటి ప్రొడ్యూస్ చేయనున్నారు. 'పొలిమేర 2'తో పాటు మలయాళ హిట్ సినిమా '2018'ను తెలుగులో విడుదల చేసింది ఆయనే. ''పొలిమేర 3'తో ఈ ఫ్రాంచైజీని ఈసారి నెక్స్ట్ లెవల్ హారర్ కు తీసుకు వెళుతున్నాం'' అని ఆయన చెప్పారు.
Also Read: రష్మీ గౌతమ్, నూకరాజు గొడవకు కారణం ఇంద్రజ యేనా - చికెన్ ముక్క, గుడ్డు కోసం రోహిణి రచ్చ
Polimera 3 movie cast and crew: 'సత్యం' రాజేష్, కామాక్షీ భాస్కర్ల ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న 'పొలిమేర 3' చిత్రంలో మొదటి రెండు సినిమాల్లో నటించిన బాలాదిత్య, 'గెటప్' శ్రీను, రాకేందు మౌళి ప్రధాన తారాగణం. 'పొలిమేర 3' చిత్రానికి భోగేంద్ర గుప్తా కో ప్రొడ్యూసర్. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
Also Read: ఆహా 'జిలేబి'... ఓటీటీలోకి థియేటర్లలో డిజాస్టర్ ఫిల్మ్, ఆల్మోస్ట్ ఏడాది తర్వాత!