'అఖండ 2 తాండవం' సినిమా (Akhanda 2 Thaandavam) గురించి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) గారు విన్నారని, సినిమాలో కథాంశం గురించి తెలుసుకున్నారని చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) తెలిపారు. ఇటువంటి గొప్ప చిత్రానికి తమ మద్దతు తప్పకుండా ఇవ్వాలనేది మన ప్రియతమ ప్రధాని ఆలోచన అని ఆయన వివరించారు.

Continues below advertisement

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన తాజా సినిమా 'అఖండ 2 తాండవం'. డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తోంది. ఈ తరుణంలో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. అందులో బోయపాటి శ్రీను ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

ఢిల్లీలో మోడీ కోసం స్పెషల్ షో!దేశ రాజధాని ఢిల్లీలో అతి త్వరలో 'అఖండ 2 తాండవం' సినిమా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు బోయపాటి శ్రీను తెలిపారు. ఆ స్పెషల్ షో కి ప్రధాని మోడీ కూడా హాజరు అవుతారని ఆయన వివరించారు. తమ సినిమాను మోడీ గారు చూడబోతున్నారని ఆయన స్పష్టంగా చెప్పారు.

Continues below advertisement

Also Read: ఎవరీ సంగే సెల్ట్రామ్? 'అఖండ 2 తాండవం'లో మెయిన్ విలన్ గురించి తెలుసా? రియల్‌ లైఫ్‌లోనూ ఆర్మీ ఆఫీసరే... బ్యాగ్రౌండ్ ఇదే

'అఖండ 2' చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు బోయపాటి శ్రీను కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా ఈ చిత్రానికి వెన్నుదన్నుగా నిలబడిన అగ్ర నిర్మాత దిల్ రాజు, మ్యాంగో రాం, శ్రీధర్ డాక్టర్ సురేంద్ర గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. భారతదేశ ధర్మ గ్రంథాలయం అని, ధర్మానికి భారతదేశం తల్లి వేరు లాంటిదని, దాన్ని నమ్మిన దేశాలన్నీ అద్భుతంగా ఉన్నాయని, నమ్మని దేశాలు ఇంకోలా ఉన్నాయని బోయపాటి చెప్పారు. మనిషి అనుకుంటే గెలవచ్చని లేదా ఓడిపోవచ్చని కానీ దేవుడు అనుకుంటే గెలుపు మాత్రమే ఉంటుందని, ఆ విధంగా దేవుడు గెలిపించిన సినిమా 'అఖండ 2' అని బోయపాటి తెలిపారు. సినిమా అద్భుతంగా వచ్చిందంటే కారణం బాలయ్య బాబు గారి మద్దతు అని ఆయన మద్దతు లేకపోతే ఇంత పెద్ద సినిమా చేయలేమని బోయపాటి తెలిపారు.

Also Readఎవరీ తరుణ్ ఖన్నా? 'అఖండ 2'లో శివుడు ఈయనే - హిందీలో వెరీ పాపులర్... ఇంతకు ముందు చేశారో తెలుసా?