కమర్షియల్ సినిమాలో తీయలేక కాదని, తనకు తీయాలని లేదని, కవిత్వం తనకు ఒక ఆరాటం అని దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) కామెంట్ చేశారు. '8 వసంతాలు' (8 Vasanthalu Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన స్పీచ్ పట్ల విమర్శలు వ్యక్తం అయ్యాయి. పెన్ను పక్కన పెట్టి ఒక పది నిమిషాలు మనసుకు సంబంధించిన విషయాలు, మనకు ఎందుకు ఈ గోల అని పక్కన పెట్టేస్తే ఎలా ఉంటుందో వారణాసి నేపథ్యంలో తీసిన ఫైట్‌లో చూస్తారని చెప్పారు. 

యూట్యూబ్‌లో విడుదలైన 'మధురం', థియేటర్లలో విడుదలైన 'మను' సినిమాలతో ఫణీంద్ర నరిశెట్టి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా '8 వసంతాలు'. 'మ్యాడ్' ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా జూన్ 20వ తేదీన థియేటర్లలో విడుదల అవుతోంది. అమెరికాలో రెండు రోజులు ముందు ప్రీమియర్లు వేశారు. తెలుగు రాష్ట్రాలలో జూన్ 19వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలు వేస్తున్నారు. అసలు ఈ సినిమా ఎలా ఉంది? ప్రీమియర్ షోస్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఏమిటి? అనేది చూస్తే...

'8 వసంతాలు' ఫస్టాఫ్ పర్వాలేదు...మరి సెకండాఫ్ సంగతి ఏంటి? చూడొచ్చా?Phanindra Narsetti's 8 Vasanthalu First Review: ఇంటర్వెల్ వరకు '8 వసంతాలు' చాలా మంచి ఫీలింగ్ ఇచ్చిందని ప్రీమియర్స్ చూసిన జనాలు చెబుతున్నారు. ఒక రొమాంటిక్ నావెల్ చూసినట్టు ఉంటుందట '8 వసంతాలు' ఫస్టాఫ్. ఇంటర్వెల్ ముందు వరకు మంచి డైలాగులు పడ్డాయని, లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ కూడా బావుందని అంటున్నారు. అసలు సమస్య అంతా సెకండాఫ్ మొదలైన తర్వాత అని చెబుతున్నారు. ఇంటర్వెల్ తర్వాత కథ అసలు బాలేదని, కథతో పాటు ఆ సన్నివేశాల్లో సహజత్వం లోపించిందని చెబుతున్నారు.

ఫణీంద్ర నర్సెట్టి డైలాగ్స్ బావున్నాయి...కానీ దర్శకుడిగా ఆయన తీసిన విధానం బాలేదా?'8 వసంతాలు'కు ప్రధాన బలం ఫణీంద్ర రాసిన మాటలేనట. ప్రతి మాటలో ఒక కవిత్వం ధ్వనించిందని ఆల్రెడీ సినిమా చూసిన జనాలు చెబుతున్నారు. అయితే దర్శకుడిగా ఆయన తీసిన విధానం పట్ల విమర్శలు ఎక్కువ వ్యక్తం అవుతున్నాయి. ఆర్ట్ సినిమాల్లో ఎమోషనల్ డెప్త్ చూపించడం కోసం స్లో పేస్ ఎంపిక చేస్తారని, కానీ ఈ సినిమాలో దర్శకుడు అర్థవంతనమైన భావోద్వేగాలు చూపించడంలో ఫెయిల్ అయ్యాడని అంటున్నారు. ఆయన మరీ నిదానంగా సినిమాను ముందుకు తీసుకు వెళ్లారట.

Also Read: తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ : కార్తీక దీపం 2 దూకుడుకు సాటేది? స్టార్ మా, జీ తెలుగు ఛానల్స్ పరిస్థితి ఏంటి?

అనంతిక బాగా చేసింది... ఆ క్యారెక్టర్ కూడా!ఫణీంద్ర నర్సెట్టి ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ బాగా చేశారని, ఆ పాత్రలో అనంతిక సనీల్ కుమార్ కూడా బాగా చేసిందని అమెరికా నుంచి వచ్చిన ప్రీమియర్ రిపోర్ట్స్ బట్టి తెలుస్తోంది. విమెన్ పవర్ గురించి చెప్పే కొన్ని సన్నివేశాలు చాలా బావున్నాయట. కానీ, స్లో పేస్ మేకింగ్ స్టైల్ ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుందట. హీరోయిన్ క్యారెక్టర్ రాసినంత బాగా మిగతా క్యారెక్టర్లు రాలేదని కథతో పాటు వీక్ క్యారెక్టరైజేషన్లు, దర్శకత్వం సినిమాకు మైనస్ అట. థియేటర్లలో కంటే ఓటీటీలో సినిమా చూస్తే బావుంటుందని ఎర్లీ రిపోర్ట్స్ వస్తున్నాయి.

Also Readపవన్ సన్నిహితులే టార్గెట్... జగన్ కోసం సినిమా ఇండస్ట్రీనీ వదల్లేదు..‌. ఆ సెలబ్రిటీలు ఫోన్ ట్యాపింగ్ బాధితులే!?