Latest Crime Thriller OTT : క్రైమ్ థ్రిల్లర్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఓ కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఐఎండీబీలో 9.2 రేటింగ్‌తో దూసుకెళ్తోంది.
అసలెందుకు చూడాలి?
మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ ఊహించని ట్విస్టులు ఆడియన్స్‌కు సూపర్ థ్రిల్ పంచుతాయి. కథ మొత్తం కర్ణాటకలోని కూర్గ్ (కడుగు) ప్రాంతం నేపథ్యంలో సాగుతుంది. పీటర్ అనే యువకుడు చెండే (సాంప్రదాయ వాయిద్యం) వాయించే డ్రమ్మర్. చిన్నప్పుడే కొన్ని ఊహించని ఘటనలతో తన తల్లి, సొంతూరికి దూరంగా ఉంటాడు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఊరికి తిరిగొస్తాడు. ఫస్ట్ అంతా ప్రశాంతంగానే అనిపించినా ఆ తర్వాత కొన్ని చేదు ఘటనలు, గత జ్ఞాపకాలు అతన్ని వెంటాడతాయి. ఆ ఊరి ఆలయంలో ఉత్సవాల టైంలో జరిగిన ఓ వివాదం అతని జీవితాన్ని మార్చేస్తుంది.
ఊరి ప్రజలు దాచిన రహస్యాలు, ఆ వివాదం మిస్టరీ సంఘటన చుట్టూనే ఈ సినిమా సాగుతుంది. మిస్టరీని ఛేదించే క్రమంలో నమ్మిన వాళ్లే తనను నట్టేట ముంచారని తెలుసుకుంటాడు ఆ యువకుడు. ఆ తర్వాత ఏం జరిగింది? వారిపై ఆ యువకుడు ఎలా పగ తీర్చుకున్నాడు? తాను ప్రేమించిన యువతిని ఎందుకు దూరమయ్యాడు? అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
టైటిల్ ఏంటి? నటీనటులు ఎవరు?
ఈ మూవీ టైటిల్ పీటర్. సుకేష్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో... రాజేష్ ధ్రువ (పీటర్ పాత్రలో), జాన్వీ రాయల, రవీక్ష శెట్టి తదితరులు కీలకపాత్రలు పోషించారు. వృద్ధి స్టూడియోస్ బ్యానర్‌పై రవి హిరేమత్, రాకేష్ హెగ్గాడే నిర్మించారు. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో పీటర్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. జూన్ 5 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రాగా... సూపర్ రెస్పాన్స్ అందుకుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
Also Read : Ram Charan : పెద్ది సినిమా చూసిన రామ్ చరణ్ - ఫ్యాన్ స్పెషల్ రిక్వెస్ట్... పెద్ది రియాక్షన్ ఇదే
