Cab Driver Files Case On Chatrapathi Actor Supreeth : టాలీవుడ్ నటుడు, ఛత్రపతి ఫేం సుప్రీత్ వివాదంలో చిక్కుకున్నారు. తనపై దాడి చేశారంటూ ఆయనపై ఓ క్యాబ్ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీహరి అనే క్యాబ్ డ్రైవర్ ఆదివారం తన ట్రిప్ కంప్లీట్ చేసుకుని మరో బుకింగ్  కోసం నాగారం చౌరస్తాలో రోడ్డు పక్కన తన కారు నిలిపాడు. అదే టైంలో కారులో వచ్చిన నటుడు సుప్రీత్ (కాట్‌రాజ్) వచ్చి రోడ్డుకు అడ్డంగా ఉన్నావనే ఆగ్రహంతో క్యాబ్ డ్రైవర్‌ను దుర్భాషలాడుతూ దాడి చేశాడు. వెంటనే బాధితుడు డయల్ 100కు ఫోన్ చేసి దాడి సమాచారం అందించి... వారి సూచన మేరకు కీసర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు.

Also Read : Janhvi Kapoor : జాన్వీ కపూర్‌కే మా సపోర్ట్ - డైరెక్టర్ హద్దులు దాటారు... అచ్చియమ్మ రోల్ కాంట్రవర్సీపై లేటెస్ట్ కామెంట్

ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి సినిమాలో కాట్రాజ్ రోల్‌తో నటుడు సుప్రీత్ సూపర్ ఫేం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. ఢీ, రెడీ, కింగ్, నేనింతే, గజినీ, రగడ, మర్యాద రామన్న, దూకుడు, నిప్పు, ఎక్స్ ప్రెస్ రాజా, సరైనోడు, వీడెవడు వంటి మూవీస్‌లో నటించారు.

Also Read : This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో పెద్ద సినిమాలు - వీరభద్రుడు To భూత్ బంగ్లా... తెలుగు బోల్డ్ సిరీస్ డోంట్ మిస్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.