తమిళ డబ్బింగ్ సినిమాలు 'నా పేరు శివ', 'అంధగారం'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు వినోద్ కిషన్ (Vinod Kishan). ఆయన హీరోగా యాక్ట్ చేసిన స్ట్రెయిట్ తెలుగు సినిమా 'పేకమేడలు' (Pekamedalu Movie). 'బాహుబలి' ఫేమ్, 'ఎవరికీ చెప్పొద్దు'తో హీరోగా విజయాన్ని అందుకున్న రాకేష్ వర్రే దీనికి నిర్మాత. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో అనూషా కృష్ణ హీరోయిన్. జూలై 19న సినిమా రిలీజ్ అవుతోంది. ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు. 


'పేకమేడలు' ట్రైలర్ ఎలా ఉందంటే?
'పేకమేడలు'లో లక్ష్మణ్ పాత్రలో వినోద్ కిషన్ నటించారు. ఎటువంటి బాధ్యతలు లేకుండా పగటి కలలు అనే భర్త రోల్. అతని భార్యగా వరలక్ష్మి పాత్రలో అనూషా కృష్ణ నటించారు.


భర్త ఏ పని చేయకుండా పగలంతా ఫోనులో పేకాట ఆడుతూ, రాత్రిపూట తాగుతూ వున్నా సరే భార్య గొడవలు పెట్టుకోలేదు. చిరుతిళ్ళు అమ్మడం, కర్రీ పాయింట్ పెట్టి ఇంటి బాధ్యతలు భుజాన వేసుకుంటుంది. భర్త ఉద్యోగం చేస్తే మంచి ఇంటిలో అద్దెకు వుండొచ్చని ఆశ పడుతుంది. ఉద్యోగానికి వెళ్లిన లక్ష్మణ్... అమెరికాలో భర్త, పిల్లలను వదిలేసి వచ్చిన ఓ లేడీ వెంట పడతాడు. ఆమె దగ్గర డబ్బులు తీసుకుని వ్యాపారం మొదలు పెడతాడు. భార్య పేరు మీద అప్పులు చేస్తాడు. వేలకు వేల రూపాయలు ఖర్చు చేస్తాడు. చివరకు భార్య చేతిలో తన్నులు తింటాడు. ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


Also Read: ప్రణీత్ హనుమంతు ఎక్కడ ఉంటాడు - హైదరాబాద్‌ సిటీలోనా... అమెరికాలోనా?






క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్ సంస్థలో 'పేకమేడలు' రెండో సినిమా. ఈ చిత్రానికి నీలగిరి మామిళ్ళ దర్శకుడు. ఆయనతో పాటు హీరో హీరోయిన్లకు తొలి తెలుగు చిత్రమిది. ఈ తరహా కథతో తెలుగు తెరపై ఇటువంటి కథతో సినిమా రాలేదని దర్శక నిర్మాతలు తెలిపారు. 


Also Readప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?



వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నటించిన 'పేకమేడలు' సినిమాలో రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: అనూషా బోరా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కేతన్ కుమార్, ఛాయాగ్రహణం: హరిచరణ్ కె, కూర్పు: సృజన అడుసుమిల్లి - హంజా అలీ, సంగీత దర్శకుడు: స్మరణ్ సాయి, నిర్మాణ సంస్థ: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్, నిర్మాత: రాకేష్ వర్రే, రచన - దర్శకత్వం: నీలగిరి మామిళ్ల.


Also Readఓటీటీలోకి ఈ వారమే సుధీర్ బాబు 'హరోం హర' - Prime Video, ETV Winలో కాదు, ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?