Peddi Nizam Theatres List: 'పెద్ది' రిలీజ్ జూన్ 4న. ముందు రోజు (జూన్ 3) నైట్ ప్రీమియర్లు. టికెట్ రేట్లు విషయంలో ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రీమియర్ షోలకు 600 ఫ్లాట్ రేటు నిర్ణయించింది. తర్వాత కూడా పది రోజుల పాటు రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఇంకా జీవో జారీ చేయలేదు. రేట్స్ పెంచుతారా? లేదా? అనే సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే విడుదల దగ్గర పడటంతో నైజాంలో థియేటర్స్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఆ లిస్టులో 'దిల్' రాజు సంస్థకు చెందిన థియేటర్లు లేకపోవడం గమనార్హం. 

Continues below advertisement

'పెద్ది' పర్సెంటేజ్ ఇష్యూ తెగలేదా?సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యజమానులు, ఎగ్జిబిటర్లు కలిసి తమకు రెంటల్ సిస్టమ్ వద్దని, పర్సెంటేజ్ కావాలని డిమాండ్ చేశారు. అందులో ప్రముఖ నిర్మాత శిరీష్ సైతం ఉన్నారు. మిగతా ఓనర్స్, ఎగ్జిబిటర్లను ఆయనతో పాటు సునీల్ నారంగ్ కలిసి ముందుకు నడిపించారు. ఆ తర్వాత నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టడం... ఛాంబర్ పెద్దల సమక్షంలో 'ఎగ్జిబిటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్' మీటింగ్ జరగడం తెలిసిన విషయాలే. ఆ సమావేశం తర్వాత 'దిల్' రాజు మీడియా ముందుకు వచ్చి 'పెద్ది' విడుదలకు ఎటువంటి సమస్య లేదు అని చెప్పారు. కానీ, పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉంది. 

Also Read: CM Vijay Visits Ajith Home - అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ

Continues below advertisement

'పెద్ది' విడుదల దగ్గర పడటంతో నైజాంలో ఏయే థియేటర్లలో సినిమా విడుదల అవుతుందో చెబుతూ ఓ లిస్ట్ విడుదలైంది. పేపర్లకు లిస్ట్ ఇవ్వడం గత కొన్నేళ్లుగా వస్తున్న ఆనవాయితీ. ఆ లిస్టులో దిల్ రాజు, శిరీష్ సోదరులకు చెందిన సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్వీసీ) అధీనంలో ఉన్న థియేటర్లు ఏవీ లేవు. దాంతో ఇంకా పంచాయతీ తెగలేదని, సమస్యలు సాల్వ్ కాలేదని అర్థం అవుతోంది. ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సునీల్ నారంగ్ కూడా తమకు మైత్రి నుంచి సరైన స్పందన రావడం లేదని పేర్కొన్నారు. మొత్తం మీద ఇష్యూ ఇంకా అలాగే ఉందని అర్థం అవుతోంది.

Also ReadManchu Manoj Vs Vishnu Manchu: మనుషుల్ని పంపించిన విష్ణు... దాసరి వర్ధంతి సాక్షిగా మంచు బ్రదర్స్ విబేధాలు

ప్రస్తుతం రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా ప్రమోషన్లలో చాలా బిజీగా ఉన్నారు. ముంబైలో ట్రైలర్ లాంచ్ తర్వాత భోపాల్ ఈవెంట్ చూసుకుని, ఆ తర్వాత బెంగళూరు, ఢిల్లీ, చెన్నైలలో ప్రెస్ మీట్స్ నిర్వహించారు. విజయవాడలో జూన్ 1న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత థియేటర్ల సమస్యపై ఆయన దృష్టి సారించే అవకాశం ఉంది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు ప్రధాన తారాగణం. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

Also ReadUpcoming OTT Releases In June 2026 - జూన్‌లో ఓటీటీ లవర్స్‌కు పండగ... ధురంధర్ 2 to కేడీ, పేట్రియాట్... స్ట్రీమింగ్ అయ్యే టైటిల్స్‌ లిస్ట్