రామ్ చరణ్ 'పెద్ది' విడుదలకు ముందు నుంచి, ఈ సినిమా అల్లు అర్జున్ 'పుష్ప 2' రికార్డులను బద్దలు కొడుతుందా? అని డిబేట్ పెట్టారు కొందరు. 'పుష్ప 2'కు ఒక అడ్వాంటేజ్ ఉంది. నార్త్ ఇండియాలో 'పుష్ప' భారీ హిట్ కావడంతో ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక్కడ 'పెద్ది' విడుదలకు ముందు రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' డిజాస్టర్ అయ్యింది. కలెక్షన్స్ కంపారిజన్ పక్కన పెడితే... రెండు కథల్లోనూ ఒక కామన్ పాయింట్ ఉంది. అది ఏమిటో తెలుసుకోండి.

Continues below advertisement

పేరు కోసం... చేశారు జీవిత యుద్ధంపుష్ప, పెద్ది... రెండు క్యారెక్టర్లు వేర్వేరు. రెండిటి కథలు వేర్వేరు. 'పుష్ప'లో హీరో ఎర్రచందనం స్మగ్లర్. కానీ, ఇక్కడ 'పెద్ది'లో హీరో క్రికెటర్. క్రికెట్ నుంచి కుస్తీ, ఆ తర్వాత కుస్తీ నుంచి రన్నింగ్ ట్రాక్ మీదకు వస్తాడు. మూడు ఆటల్లో తిరుగులేని ఆటగాడిగా కనిపిస్తాడు. అయితే... పుష్ప, పెద్ది - ఇద్దరు చేసిన యుద్ధం ఒక్కదాని కోసమే తెలుసా?

పేరు... పేరు... పేరు... పేరు కోసమే జీవిత యుద్ధం చేశారు పుష్ప, పెద్ది. అల్లు అర్జున్ 'పుష్ప' కథ గుర్తుందా? అందులో కీలకమైన అంశం ఒకటి గుర్తుందా? హీరో పుష్పరాజ్‌కు ఇంటి పేరు ఉండదు. పుష్పరాజ్ తండ్రికి తన తల్లితో కంటే ముందు మరొక మహిళతో వివాహం అవుతుంది. ఆవిడ సంతానం పుష్పరాజ్‌ను, తల్లిని తమ కుటుంబంగా గుర్తించరు. ఇంటి పేరు లేదని పుష్ప ఎంతో మనోవేదన పడతాడు. చివరకు వచ్చిన తర్వాత ఆనందభాష్పాలు వస్తాయి. కట్ చేస్తే... పెద్ది కూడా పేరు కోసమే పోరాటం చేశాడు. అతనితో పాటు అతని ఊరి పేరు కోసం యుద్ధం చేశారు.

Continues below advertisement

Also ReadPeddi Review Rating In Telugu - పెద్ది రివ్యూ: రామ్ చరణ్ సినిమా హిట్టా? ఫట్టా? క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఏమిటంటే?

'పెద్ది' కథకు వస్తే... విజయనగరానికి దగ్గరలోని ఓ కొండ కింద ఊరు హీరోది. ఆ ఊరి జనాలు ఎవ్వరికీ ఓటు హక్కు లేదు. అసలు అటువంటి ఊరు ఒకటి ఉన్నట్టు ప్రభుత్వ రికార్డుల్లో లేదు. అందుకే ఆ ఊరికి రోడ్డు, రైలు సదుపాయలు లేవు. తమ ఊరికి గుర్తింపుతో పాటు రైల్వే స్టేషన్ కోసం పెద్ది ఏం చేశాడు? చివరకు ఆ పేరును ఎలా సంపాదించాడు? అనేది కథ.

Also ReadRam Charan Vs NTR - రామ్ చరణ్ vs ఎన్టీఆర్... 'ఆర్ఆర్ఆర్' తర్వాత బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?

'పుష్ప', 'పెద్ది'... రెండు కథల్లో కోర్ పాయింట్ - గుర్తింపు. ఒకరు ఇంటి పేరు, గుర్తింపు కోసం పోరాటం చేస్తే... మరొకరు ఊరి పేరు, ఊరిలో జనాలకు గుర్తింపు కోసం లైఫ్ రిస్క్ చేసి మరీ పోరాటం చేశారు. అన్నట్టు... 'పుష్ప'ను క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తీస్తే, 'పెద్ది'ని ఆయన శిష్యుడు బుచ్చిబాబు తీశారు. గురుశిష్యులు ఐడెంటిటీ అనేది తీసుకుని వేర్వేరు కథలు రాయడం విశేషం.

Also ReadPeddi Premiere Collections - రామ్ చరణ్ 'పెద్ది' ప్రీమియర్స్ కలెక్షన్స్... ఇండియాలో ఓజీ, ధురంధర్ 2 తర్వాత