మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పాన్ ఇండియా సినిమా 'పెద్ది' (Peddi Movie) సందడి మొదలైంది. ఆల్రెడీ విడుదలైన 'చికిరి చికిరి', 'రై రై రా రా' పాటలు చార్ట్ బస్టర్లు అయ్యాయి. మిలియన్స్ కొద్దీ వ్యూస్ సాధించాయి. ఇప్పుడు ట్రైలర్ విడుదలకు చిత్ర బృందం సిద్ధమైంది. ఇవాళే 'పెద్ది' ట్రైలర్ లాంచ్. 'పెద్ది' ట్రైలర్ చూసి మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన రివ్యూ, డైలాగ్ లీక్‌తో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్‌ లాంచ్‌లో ఎవరి స్పీచ్ ఎలా ఉంది? అనేది ఇక్కడ లైవ్ చూసి తెలుసుకోండి.

Continues below advertisement

ఈవెంట్ ఎక్కడ చేస్తున్నారు? ఎన్ని గంటలకు ట్రైలర్ విడుదల చేస్తారు? ఎవరెవరు అటెండ్ అవుతారు? వంటి డీటెయిల్స్‌ కింద ఉన్నారు.

Continues below advertisement

ముంబైలో 'పెద్ది' ట్రైలర్ లాంచ్... ఎక్కడంటే?Peddi Trailer Launch Venue: బాలీవుడ్ సినిమా రాజధాని... ఆ మాటకు వస్తే భారతీయ సినిమా రాజధాని ముంబైలో 'పెద్ది' సినిమా ప్రమోషన్లకు శ్రీకారం చుట్టారు. ఇవాళ ముంబై మహానగరంలో ట్రైలర్ విడుదల చేయనున్నారు. 

ముంబైలోని బాంద్రాలో గల 'జియో వరల్డ్ డ్రైవ్' మాల్‌లోని పీవీఆర్ మల్టీప్లెక్స్ 'పెద్ది' ట్రైలర్ విడుదలకు వేదిక అయ్యింది. ఆల్రెడీ ఈవెంట్ వెన్యూ గురించి చెప్పడంతో ముంబైలోని మెగా ఫ్యాన్స్ భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

'పెద్ది' ట్రైలర్ విడుదలకు ఎవరెవరు వస్తున్నారు?'పెద్ది' ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మీడియా ముందుకు రామ్ చరణ్ రాలేదు. మొదటి పాటను ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్‌లో విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో చరణ్ కనిపించారు. ఆ తర్వాత 'పెద్ది' ప్రచార కార్యక్రమాల్లో లేరు. హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా అంతే! 

Also ReadRavi Mohan Vs Kushboo - 'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టిందెవరు? ఖుష్బూ భుజాలు తడుముకోవడం ఎందుకు?

ఇప్పుడు 'పెద్ది' ట్రైలర్ విడుదలకు రామ్ చరణ్, జాన్వీ కపూర్ హాజరవుతున్నారు. ఆల్రెడీ ముంబైలో ఉన్నారు చరణ్. అలాగే. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, చిత్ర దర్శకుడు బుచ్చిబాబుతో పాటు సినిమాలోని నటీనటులు హాజరు అయ్యారు.

ట్రైలర్ ఎన్ని గంటలకు విడుదల అవుతుంది?Peddi Trailer Release Date And Time: మే 18న... అంటే ఇవాళ ముంబైలోని 'జియో వరల్డ్ డ్రైవ్'లో 'పెద్ది' ట్రైలర్ విడుదల కార్యక్రమం నాలుగు గంటలకు మొదలు అవుతుంది. ముందుగా 04.05 గంటలకు ట్రైలర్ విడుదల చేసి ఆ తర్వాత ఈవెంట్ స్టార్ట్ చేయనున్నారు. అదీ సంగతి.

Also ReadNaga Vamsi Vs Asian Suniel - ఖతమ్ చేస్తా బిడ్డా... కొట్టుకోవడం ఒక్కటే తక్కువ - ఛాంబర్ మీటింగ్‌లో నాగవంశీ vs ఏషియన్ సునీల్

'పెద్ది' చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకం మీద వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేందు శర్మ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. రత్నవేలు సినిమాటోగ్రాఫర్.

Also ReadKamal Haasan Reacts To Rajinikanth Jealousy Comment - రజనీకాంత్ 'జెలసీ' కామెంట్‌పై కమల్ హాసన్ రియాక్షన్... మాది పోటీయే