మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. సోమవారం (మే 18వ తేదీన) ముంబైలో ట్రైలర్ (Peddi Trailer) విడుదల చేస్తున్నారు. అయితే... ముందుగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి చూపించారు. మరి, ట్రైలర్ చూశాక ఆయన ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా? 'జస్ట్ వావ్' అని! ఇంకా 'పెద్ది' ట్రైలర్ గురించి చిరంజీవి ఏమన్నారో చూడండి.
చరణ్, బుచ్చి, రెహమాన్... రఫ్ఫాడించారు!''పెద్ది' ట్రైలర్ చూశాను. జస్ట్ వావ్. మూడు నిమిషాల నిడివి ఉంది. స్వచ్ఛమైన ఫైర్ ప్యాక్డ్ ట్రైలర్ ఇది. రామ్ చరణ్... బుచ్చి (దర్శకుడు బుచ్చిబాబు)... రెహమాన్... ఒక్కొక్కరూ తమ బెస్ట్ ఇచ్చారు. ముగ్గురూ కలిసి మాత్రం రఫ్ఫాడించారు. ఎంత ఊహించుకున్నా అంతకు మించి ఉంటుందీ ట్రైలర్'' అని అంచనాలు మరింత పెంచారు చిరంజీవి.
ట్రైలర్‌లో డైలాగ్... చిరు లీక్స్ ఇచ్చారబ్బా!ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్‌నెస్... 'పెద్ది' ట్రైలర్ (Peddi Trailer Review)లో అన్నీ నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయని చిరంజీవి తెలిపారు. చిరు లీక్స్ గురించి తెలిసిందే కదా! ఇంతకు ముందు ఓ ప్రెస్ మీట్‌లో వెళ్లి తన సినిమా టైటిల్, అప్డేట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ లీక్స్ మరోసారి గుర్తు చేశారు.
Also Read: Jayam Ravi Press Meet Full Speech - జయం రవికి ప్రాణహాని ఉందా? భార్య ఆర్తికి వార్నింగ్ ఎందుకు ఇచ్చారు? కెనీషా బ్రేకప్ & విడాకులు వచ్చే వరకు సినిమాలు చేయనని ఎందుకు చెప్పారు? ఫుల్ ప్రెస్ మీట్ డీటెయిల్స్ ''అన్నట్టు... చాలా రోజులు అయ్యింది మీకు చిరు లీక్స్ ఇచ్చి'' అంటూ 'పెద్ది'లో రామ్ చరణ్ డైలాగ్ లీక్ చేశారు. అది ట్రైలర్‌లో ఉండబోతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుగా! ''మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు...నేను పోరాడాను సారు..." అని రామ్ చరణ్ డైలాగ్ లీక్ చేసి క్లాప్స్ ఎమోజీలు యాడ్ చేశారు. సారీ బుచ్చిబాబు ట్రైలర్ చూశాక కంట్రోల్ తప్పాను అంటూ సరదాగా ట్వీట్ ముగించారు.
చిరంజీవికి కథ చెప్పకుండా తప్పించుకున్నా!'పెద్ది' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న బుచ్చిబాబు మరోవైపు ప్రమోషనల్ కార్యక్రమాలు ప్రారంభించారు. చిరంజీవి గారికి కథ చెప్పకుండా తప్పించుకు తిరిగినట్టు చెప్పారు. తనకు అదొక ప్రౌడ్ మూమెంట్ అని తెలిపారు. 'పెద్ది' క్లైమాక్స్ గురించి కూడా బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ చెప్పారు. ఇటువంటి కథను మళ్ళీ తాను రాయలేనని, ఇటువంటి సినిమాను మళ్ళీ రామ్ చరణ్ చేయలేరని ఆయన వివరించారు.
Photo Gallery: Anasuya Bikini Photos - బికినిలో అనసూయ... ప్రేక్షకులకు బర్త్ డే ట్రీట్ రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. అయితే జాన్వీని కాకుండా మరొక అమ్మాయిని హీరోయిన్ రోల్ కోసం ముందు సంప్రదించినట్టు బుచ్చిబాబు పేర్కొన్నారు. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు నటించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ అధినేత వెంకట సతీష్ కిలారు భారీ నిర్మాణ వ్యయంతో నిర్మిస్తున్నారు. రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది.
