రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'కి వీకెండ్ తర్వాత కలెక్షన్స్ తగ్గిన సంగతి తెలిసిందే. అయితే బాక్సాఫీస్ దగ్గర రోజు రోజుకూ మరింత తగ్గుదల కనిపిస్తోంది. వర్కింగ్ డేస్‌లో సినిమాకు వచ్చే జనాల సంఖ్య తగ్గుతోంది. సినిమా రిలీజైన సెకండ్ వీకెండ్ (ఈ శుక్రవారం నుంచి ఆదివారం వరకు) ఎలా ఉంటుందో చూడాలి. ఎనిమిదో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
మూడు వందల కోట్లకు దగ్గరలో!Peddi Eight Days Collection: ప్రపంచవ్యాప్తంగా తమ సినిమా 345 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని ప్రొడక్షన్ హౌస్ వృద్ధి సినిమాస్ అనౌన్స్ చేసింది. అయితే ట్రేడ్ పోర్టల్ - కలెక్షన్స్ వివరాలు వెల్లడించే సాక్నిల్క్ (Sacnilk) ప్రకారం... ఈ సినిమా గ్రాస్ ఇంకా 300 దాటలేదు.
- థియేటర్లలో విడుదలైన ఎనిమిదవ రోజున ఇండియాలో 'పెద్ది'కి రూ. 6.30 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి.
- ఏడవ రోజు వసూళ్లు (రూ. 7.55 కోట్ల)తో పోలిస్తే 16.6 శాతం డ్రాప్ కనిపించింది. వర్కింగ్ డేస్‌లో అన్ని వసూళ్లు రావడం గ్రేట్ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
- ఇప్పటి వరకు ఇండియాలో 'పెద్ది' టోటల్ నెట్ కలెక్షన్లు రూ. 193.55 కోట్లు.
- 'పెద్ది' ఇండియా గ్రాస్ వసూళ్లు (ఎనిమిది రోజుల్లో) రూ. 229.95 కోట్లు.
- విదేశాల్లో (ఓవర్సీస్) కూడా 'పెద్ది' కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. ఎనిమిదో రోజు రూ. 60 లక్షల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఓవర్సీస్ టోటల్ గ్రాస్ రూ. 49.40 కోట్లకు చేరింది.
- ప్రపంచవ్యాప్తంగా 'పెద్ది' టోటల్ గ్రాస్ కలెక్షన్లు ఎనిమిది రోజులకు... రూ. 279.35 కోట్లు. సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి 300 కోట్ల క్లబ్బులోకి చేరే అవకాశం ఉంది.
Peddi Collections In Telugu States: 'పెద్ది' సినిమాకు ముందు నుంచి తెలుగు రాష్ట్రాలే బలంగా నిలిచాయి. ఎనిమిదవ రోజున కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి రూ. 5.30 కోట్ల గ్రాస్ వచ్చింది. హిందీలో ఎనిమిదో రోజు కోతికి పైగా కలెక్ట్ చేసింది. ఆ తర్వాత కర్ణాటక నుంచి రూ. 55 లక్షలు, తమిళనాడు నుంచి రూ. 25 లక్షలు వచ్చాయి.
సినిమాకు వసూళ్లు వస్తున్నా... జాన్వీ కపూర్ పాత్రపై విమర్శల రావడంతో కొంత ఇబ్బంది పెట్టే అంశం. అయితే... దర్శకుడు బుచ్చిబాబు సానా అభ్యంతరకర సన్నివేశాలను తొలగించడంతో పాటు రీ ఎడిటెడ్ వెర్షన్ రిలీజ్ చేయాలని తీసుకున్న నిర్ణయంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరగవచ్చని చిత్ర బృందం భావిస్తోంది. జగపతి బాబు, శివ రాజ్‌కుమార్ తదితరులు నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
