Narendra Modi Congratulates Payal Kapadia: 2024లో జరిగిన 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చాలామంది ఇండియన్ మేకర్స్ తమ సత్తాను చాట్టుకున్నారు. అందులో ఒక ఇండియన్ లేడీ డైరెక్టర్ కూడా ఉండడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకే గర్వ కారణం. తాను తెరకెక్కించిన ‘ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్’ అనే సినిమాకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ప్రిక్స్ అవార్డును అందుకున్నారు పాయల్ కపాడియా. దీంతో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అంతా ఒక్కసారిగా ఆమె వైపు, ఆమె సినిమావైపు చూశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం పాయల్ కపాడియాను కొనియాడారు.


ఇండియా గర్వపడుతుంది..


కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ ప్రిక్స్‌తో పాటు పాల్మ్ డిఓర్ కేటగిరిలో కూడా పాయల్ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్’ చిత్రం పోటీపడింది. కానీ ఆ అవార్డ్.. షేర్ బేకర్ తెరకెక్కించిన ‘అనోరా’ అనే చిత్రానికి వెళ్లింది. అయినా కూడా ఒక ఇండియన్ ఫిల్మ్ గ్రాండ్ ప్రిక్స్ అవార్డును సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అందుకే ప్రధాన మంత్రి సైతం దీని గురించి ట్వీట్ చేయడానికి ముందుకొచ్చారు. ‘‘ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్’ ద్వారా 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్ సాధించి చరిత్ర సృష్టించిన పాయల్ కపాడియాను చూసి ఇండియా గర్వపడుతుంది’’ అని చెప్పుకొచ్చారు నరేంద్ర మోదీ.


ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుంది..


‘‘ఇండియాలోని గొప్ప క్రియేటివిటీని ప్రపంచానికి చాటిచెప్తూ అంతర్జాతీయ స్టేజ్‌పై ఒక మాజీ ఎఫ్‌టీఐఐ విద్యార్థి అయిన పాయల్ కపాడియా ఇలాగే వెలిగిపోతూ ఉండాలి. ఈ ఘనత కేవలం తన స్కిల్స్‌కు గౌరవాన్ని అందించడంతో పాటు భవిష్యత్తులో తయారుకానున్న ఎంతోమంది ఫిల్మ్ మేకర్స్‌కు ఇన్‌స్పిరేషన్‌గా కూడా నిలుస్తుంది’’ అంటూ తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ‘ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్’ ద్వారా 30 ఏళ్ల తర్వాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని పాల్మ్ డిఓర్ కేటగిరిలో, గ్రాండ్ ప్రిక్స్ కేటగిరిలో ఒక ఇండియన్ ఫిల్మ్ ఫీచర్ అయ్యింది.






కంగ్రాట్స్..


కేంద్ర బ్రాడ్కాస్టింగ్ మంత్రి అయిన అనురాగ్ థాకూర్, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ లాంటి రాజకీయ నాయకులు సైతం పాయల్ కపాడియా ఘనతను గుర్తించి ట్వీట్లు చేశారు. సినీ పరిశ్రమ నుండి కూడా పలువురు ప్రముఖులు పాయల్ కపాడియాను ట్యాగ్ చేస్తూ గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకున్నందుకు కంగ్రాట్స్ తెలిపారు. ‘ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్’లో ఛాయా కదమ, దివ్య ప్రభ, కానీ కుస్రుతీ లీడ్ రోల్స్‌లో నటించారు.


Also Read: ఇండియన్ లేడీ డైరెక్టర్ ఘనత - కేన్స్‌లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్ దక్కించుకున్న పాయల్ కపాడియా