Pawan Kalyan With Akira Mark Shankar: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన ఇద్దరు కుమారులతో ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెద్ద కుమారుడు అకీరా నందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్‌తో కలిసి శుక్రవారం ఉదయం మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఈ ఫోటో క్లిక్ అనిపించగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

తన నివాసానికి చేరుకున్న తర్వాత పవన్... అధికారులు, పార్టీ ప్రతినిధులను కలిశారు. ముఖ్యమైన విషయాలపై చర్చించారు. ఆ తర్వాత మార్కాపురం నియోజకవర్గం పర్యటనకు వెళ్లారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. రూ.1,290 కోట్లతో జలజీవన్ మిషన్ కింద తాగునీటి పథకానికి శంకుస్థాపన చేయనున్నారు.

ఫ్యాన్స్ ఖుష్...

ఒకే ఫ్రేమ్‌లో తండ్రీ కొడుకులను చూసిన పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తోన్న ఫ్యాన్స్... సింహం పక్కన ఓ చిన్న రెండు సింహాలు ఉన్నట్లుగా ఫోటో ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు. 'తండ్రీ తనయులు' అనే క్యాప్షన్‌తో పంచుకుంటున్నారు. 

ఇటీవలే పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కాగా వైద్యులు చికిత్స అందించారు. పూర్తిగా కోలుకున్న తర్వాత మార్క్ శంకర్‌ను హైదరాబాద్ తీసుకొచ్చారు పవన్. ఇటీవలే అతన్ని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని ఇక్రిశాట్ స్కూల్‌లో చేర్పించారు. ప్రమాదం తర్వాత సింగపూర్ పంపకుండా హైదరాబాద్‌లోనే ఉంచి చదివించనున్నట్లు తెలుస్తోంది.

ఇక అకీరా నందన్ విషయానికొస్తే... ప్రస్తుతం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పవన్ వారసుడిగా అకీరా ఎంట్రీ కోసం ఆయన ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: 'తమ్ముడు' రివ్యూ: అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా? నితిన్ సినిమా హిట్టా? ఫట్టా?

ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజా పాలనలో పవన్ కల్యాణ్ ప్రస్తుతం బిజీగా మారారు. ఇదివరకు కమిట్ అయిన మూవీస్‌ను ఆయన శరవేగంగా పూర్తి చేస్తున్నారు. హిస్టారికల్ అడ్వెంచర్ మూవీ 'హరిహర వీరమల్లు' జులై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయ్యి ట్రెండింగ్ సృష్టిస్తోంది. ఒక్క తెలుగులోనే 48 మిలియన్ వ్యూస్ రాగా... అన్ని భాషల్లో కలిపి ట్రైలర్‌కు 61.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. జ్యోతికృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇక 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ షూటింగ్స్ కూడా పూర్తి కాబోతున్నాయి.