సమ్మర్ సీజన్‌లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బరిలో దిగే మొదటి హీరో ఎవరు? అంటే... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అని చెప్పాలి. ఆయన కథానాయకుడిగా రూపొందిన 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh)ను మార్చి 26న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. అయితే... ఇప్పుడు ఆ సినిమాను ఓ వారం ముందుకు తీసుకు రావడానికి ప్లాన్ చేశారు. ఎందుకు? అంటే...

'టాక్సిక్' వాయిదాతో 'ఉస్తాద్' ముందుకు?నిజానికి... మార్చి 26 కంటే ముందు సమ్మర్ సీజన్‌లో మరో సినిమా రావాల్సి ఉంది. అది కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా రూపొందిన 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'. మార్చి 19న ఆ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే... ఇరాన్ - ఇజ్రాయెల్ కాన్‌ఫ్లిక్ట్‌ సందర్భంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితిల నేపథ్యంలో ఆ సినిమాను జూన్ 4వ తేదీకి వాయిదా వేశారు. దాంతో మార్చి 19కి 'ఉస్తాద్ భగత్ సింగ్'ను తీసుకు వస్తే ఎలా ఉంటుంది? అని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. 

'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రీకరణను ఎప్పుడో పూర్తి చేశారు కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్. సాంగ్స్ & ఎడిటింగ్ వర్క్ కూడా ఫినిష్ అయ్యింది. ఒక్క ఆర్ఆర్ (రీ రికార్డింగ్) మాత్రమే పెండింగ్. అది ఫినిష్ చేసి మార్చి 19న విడుదల చేస్తే అడ్వాంటేజ్ ఉంటుందని ఆలోచిస్తున్నారు. అన్నీ కుదిరితే రెండు మూడు రోజుల్లో అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

Also ReadShreyasi Sen - ABPDesam SmartED Conclave2026: సినిమాల్లో చూపించే ఆ రెండూ తప్పే - డాక్టర్ & యాక్టర్ శ్రేయాసి సేన్ ఇంటర్వ్యూ

'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల, రాశీ ఖన్నా హీరోయిన్లు. పార్తీబన్ విలన్ రోల్ చేశారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

డీఎస్పీ బదులు తమన్ ఆర్ఆర్?Thaman to Replace DSP for Ustaad Bhagat Singh Background Score?: మార్చి 19న 'ఉస్తాద్ భగత్ సింగ్'ను విడుదల చేయాలంటే... వీలైనంత త్వరగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఫినిష్ చేయాలి. అందుకు డీఎస్పీ బదులు తమన్ చేత ఆర్ఆర్ చేయిస్తే ఎలా ఉంటుంది? అనేది మరొక ప్లాన్. ప్రస్తుతం దర్శక నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అన్నీ ఓ కొలిక్కి వస్తే అసలు విషయం బయటకు వస్తుంది. 

Also ReadCockroach Telugu Movie: నేరస్తుడితో ప్రేమలో పడిన వేశ్య... బోల్డ్ కాన్సెప్ట్‌తో 'కాక్రోచ్' - దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి ఏం చెప్పారంటే?

దేవిశ్రీ ప్రసాద్, తమన్... సంగీత దర్శకులు ఇద్దరితోనూ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ సినిమాలు చేశారు. పవన్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన 'గబ్బర్ సింగ్' సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. పవన్ కళ్యాణ్ లాస్ట్ హిట్ 'ఓజీ'కి తమన్ సంగీతం అందించారు. మరి ఇప్పుడు ఏం అవుతుందో చూడాలి. ఎందుకంటే... 'పుష్ప 2' నేపథ్య సంగీతం చేస్తున్నానని తమన్ చెప్పారు. కానీ, ఆయన పేరు స్క్రీన్ మీద పడలేదు. సామ్ సిఎస్ పేరును అడిషనల్ మ్యూజిక్ లిస్టులో వేశారు. అదీ సంగతి.

Also ReadToxic Release Postponed: యశ్ 'టాక్సిక్' విడుదల వాయిదా... 'ధురంధర్ 2'కు లైన్ క్లియర్... అసలు రీజన్ ఏమిటంటే?