They Call Him OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరిహర వీరమల్లు’ సినిమాల షూటింగ్‌లను సమాంతరంగా చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘ఓజీ’ సెకండ్ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన ఒక ఫొటోను పవన్ కళ్యాణ్ షేర్ చేశారు. ఈ ఫొటోతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు. ఇంతకీ అందులో ఏం ఉంది?
17 సంవత్సరాల తర్వాత...
ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్‌కు సంబంధించిన కాస్ట్యూమ్‌లో కనిపించారు. ఎప్పుడో 17 సంవత్సరాల క్రితం 2006లో వచ్చిన ‘అన్నవరం’ సినిమాలోని ‘నీ వల్లే నీ వల్లే’ పాటలో చివరి సారిగా పవన్ కళ్యాణ్‌ను ఆ గెటప్‌లో కనిపించారు. కల్ట్ క్లాసిక్ ‘ఖుషి’లో కూడా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఈ కాస్ట్యూమ్‌తోనే ఉంటుంది.
పవన్ కళ్యాణ్‌కు అరివీర భయంకర ఫ్యాన్ అయిన దర్శకుడు సుజీత్ ఇప్పుడు అవే లుక్స్‌ను తిరిగి తీసుకువస్తున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. పూర్తిగా గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ‘ఓజీ’ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఎప్పుడు విడుదల కానుందనే సంగతి మాత్రం తెలియరాలేదు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పుణెలో జరుగుతుంది. అందమైన పచ్చని లొకేషన్స్ నడుమ ఈ సినిమా షూటింగ్ కొనసాగుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం పుణెలో చిత్రబృందం కొన్ని పాటలను చిత్రీకరిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్నారు. మాఫియా డాన్స్ అందరూ ఆయన అంటే భయపడే సన్నివేశాలు ఉన్నాయట. తొలిసారిగా పవర్ స్టార్ తో సుజీత్ తీస్తున్న మూవీ కావడం, ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో భారీ విజయం సొంతం చేసుకున్న డీవీవీ సంస్థ దీనిని నిర్మించడంతో ‘OG‘పై పవన్ ఫ్యాన్స్ లో సినీ లవర్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక పవన్ కథానాయకుడిగా డీవీవీ సంస్థలో రెండో చిత్రమిది. ఇంతకు ముందు 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా నిర్మించారు. పదేళ్ళ తర్వాత మళ్ళీ పవన్‌తో సినిమా చేస్తుండటం విశేషం.
'ఓజీ' ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేస్తున్న 'హరిహర వీరమల్లు' లేటెస్ట్ షెడ్యూల్ మొదలవుతుందని వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం ‘OG’ షెడ్యూల్‌ను పొడిగించాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. మొదట్లో ప్రతిపాదించిన వారం రోజుల షెడ్యూల్ ఇప్పుడు నెలరోజుల షెడ్యూల్‌గా మారింది.