Pawan Kalyan's True Date Of Birth Revealed: కొణిదెల పవన్ కల్యాణ్.. ఈయన ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. ఈయనకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. అభిమానులందు పవన్ అభిమానులు వేరయ్యా అనేలా ఉంటారు ఈయన అభిమానులు. అభిమాన హీరోకి సంబంధించి ప్రతి విషయాన్ని ఆసక్తిగా తెలుసుకుంటారు. ఆసక్తిగా నిర్వహిస్తారు. అయితే, పవన్ అభిమానుల్లో మాత్రం ఒక కన్‌ఫ్యూజన్ ఎప్పుడూ ఉంటుంది. అదే ఆయన డేట్ ఆఫ్ బర్త్. సెప్టెంబర్ 2 బర్త్ డే అని అందరికీ తెలుసు. కానీ, ఏ సంవత్సరం పుట్టాడు అనేది కన్ ఫ్యూజన్. ఇప్పుడిక దానిపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది.
వికిపీడియాలో కూడా..
పవన్ కల్యాణ్ పుట్టిన సంవత్సరంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. వికీపీడియాలో కూడా ఆయనకు రెండు డేట్ ఆఫ్ బర్త్ లు ఉంటాయి. 2 సెప్టెంబర్ 1968 లేదా 1971 అని ఉంటుంది. దీంతో ఆయన వయసుకు సంబంధించి కూడా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన రియల్ డేట్ ఆఫ్ బర్త్ బయటికి వచ్చింది. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. దాని ద్వారా ఆయన ఆధార్ కార్డు బయటికి వచ్చింది.
షష్టి పూర్తికి దగ్గరలో..
పిఠాపురంలో పవన్ కల్యాణ్ నామినేషన్ వేసిన అఫిడవిట్ లో, ఆధార్ కార్డు ఆధారంగా.. ఆయన డేట్ ఆఫ్ బర్త్.. సెప్టెంబర్ 2, 1968 అని ఉంది. అంటే దీని ప్రకారం పవన్ వయసు 56 ఏళ్లు. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆయన 57వ ఏట అడుగుపెడతారు. అంటే మరో మూడేళ్లలో పవన్ షష్టిపూర్తికి దగ్గర్లో ఉన్నారన్నమాట అంటూ కామెంట్లు పెడుతున్నారు కొందరు. మరి కొంతమందేమో.. ఈ ఏజ్ లో కూడా ఎంత ఫిట్ గా ఉన్నారు అంటున్నారు. ఏది ఏమైనా.. పవన్ కళ్యాణ్ అఫిడవిట్‌తో గందరగోళానికి పుల్‌స్టాప్ పడింది.
పాలిటిక్స్‌లో బిజీ బిజీగా..
‘బ్రో’ సినిమా తర్వాత స్క్రీన్ మీద కనిపించలేదు పవన్ కల్యాణ్. కానీ, ఆయన సినిమాలు వరుసగా లైన్ లో ఉన్నాయి. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీర మల్లు తదితర సినిమాల్లో నటిస్తున్నారు పవన్ కల్యాణ్. అయితే, ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చారు. ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దాంట్లో భాగంగా ఆయన నామినేషన్ కూడా వేశారు. మరో వైపు జనసేన పార్టీ తరఫున పోటీలో నిలబడ్డ వాళ్లకి మద్దతుగా ప్రచారం చేస్తూ పాలిటిక్స్ లో బీజీ అయిపోయారు పవన్. ఇక ఈ మధ్యే రిలీజైన ఉస్తాద్ భగత్ సింగ్.. సినిమాకి సంబంధించి రిలీజైన వీడియోలో కూడా పవర్ ఫుల్ డైలాగులు ఉన్నాయి. పొలిటికల్ పంచ్‌లు, జనసేన గుర్తు గ్లాసుకు సంబంధించి డైలాగులు ఉన్నాయి. దీంతో జనసైనికుల్లో రెట్టింపు ఉత్సాహం వచ్చిందనే చెప్పాలి.