Pawan Kalyan's OG Fire Storm Song Sets Record: ఫైర్ స్ట్రోమ్... హై ఎనర్జిటిక్ ట్యూన్... అందులోనూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సాంగ్. ఇక చెప్పేదేముంది. 'ఆ పాట రికార్డులు క్రియేట్ చేయడం కాదు... రికార్డులే ఆ సాంగ్ కోసం వెయిట్ చేస్తాయి.' అనేలా 'ఓజీ' నుంచి లేటెస్ట్‌గా వచ్చిన 'ఫైర్ స్ట్రోమ్' సాంగ్ తుపాను సృష్టిస్తోంది.
తాజాగా... ఈ పాట స్పాటిఫైలో రికార్డ్ రెస్పాన్స్ అందుకున్నట్లు సోనీ మ్యూజిక్ తెలిపింది. తక్కువ టైంలో వేగంగా 1 మిలియన్ స్ట్రీమ్స్ అందుకున్న పాటగా రికార్డు సెట్ చేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం అటు సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ వీడియోల్లో ఈ పాట సెకండ్ ప్లేస్‌లో ఉన్నట్లు సమాచారం.
పవర్ ఫుల్ మాస్ లుక్
'అలలిక కదలక భయపడేలే... క్షణక్షణమొక తల తెగిపడేలే... ప్రళయం ఎదురుగ నిలబడెలే... ఓజెస్ గంభీర' అంటూ పవర్ స్టార్‌కు ఇచ్చిన ఎలివేషన్స్ అటు పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు మ్యూజిక్ లవర్స్‌ను కట్టిపడేస్తున్నాయి. ఇప్పటివరకూ ఆయన్ను పూర్తి మాస్ లుక్‌లో చూడాలన్న ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా బీజీఎం, ట్యూన్స్ కంపోజ్ చేశారు తమన్.
సాంగ్ స్టార్టింగ్‌లోనే పవన్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మాస్ ఫైర్ వచ్చేలా 'ఓజెస్ గంభీర' అంటూ సాగే లిరిక్స్... అంతే స్థాయిలో బీజీఎం వేరే లెవల్‌లో ఉన్నాయి. ఈ పాటకు తెలుగు లిరిక్స్ విశ్వ, శ్రీనివాస్ రాయగా... రాజకుమారి ఇంగ్లీష్ లిరిక్స్ రాశారు. ఆమెనే ఫీమేల్ వాయిస్ అందించారు. కోలీవుడ్ స్టార్ శింబుతో పాటు తమన్, నజీరుద్దీన్, దీపక్ బ్లూ, భరద్వాజ్ ఈ పాట పాడారు.
పవన్ రోల్ అదేనా?
ఈ మూవీలో పవన్ సమురాయ్ రోల్ చేస్తున్నారని తెలుస్తోంది. మాఫియా, గన్, పవర్ ఫుల్ వెపన్స్, గ్యాంగ్ స్టర్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా 'ఓజీ'ని డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్నట్లు సాంగ్, లుక్ బట్టి అర్థమవుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం సెపరేట్‌గా కొన్ని గన్స్ కూడా డిజైన్ చేయించారనే టాక్ వినిపిస్తోంది.
Also Read: సీతమ్మోరి లంకా దహనం - పవర్ ఫుల్ యోధురాలిగా స్వీటీ... అసలేంటీ 'ఘాటి'!
ఈ మూవీకి 'సాహో' ఫేం సుజీత్ దర్శకత్వ వహిస్తుండగా... పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్, శ్రియ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ మూవీని నిర్మిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఫుల్ మాస్ పవర్ ఫుల్ వారియర్ లుక్‌లో చూడాలన్న ఫ్యాన్స్ కల ఈ మూవీతో నెరవేరనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ కానుంది.