OG Movie Team Clarifies On Release Date: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ 'ఓజీ'. ఈ మూవీని సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. తాజాగా... విడుదల వాయిదా అంటూ సోషల్ మీడియాలో రూమర్స్ హల్చల్ చేశాయి. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ స్పందించింది.

Continues below advertisement


నో ఛేంజ్... ఫుల్ క్లారిటీ


'ఓజీ' మూవీ రిలీజ్ వాయిదా అంటూ వచ్చే రూమర్స్ నమ్మకండి 'సెప్టెంబర్ 25నే మూవీ వస్తుంది.' అంటూ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. దీంతో ఇక రూమర్స్‌కు చెక్ పడనుండగా... ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, ఆయన తనయుడు కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు.


'ఓజీ'లో పవన్ పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఆయన సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా... బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ నెగిటివ్ రోల్ చేస్తున్నారు. శ్రియారెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ లెజెండ్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన 'నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా' సాంగ్ గూస్ బంప్స్ తెప్పించింది. ముంబయి మాఫియా నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా మూవీ తెరకెక్కుతోంది. టైటిల్ టీజర్, గ్లింప్స్, లుక్స్ హైప్ క్రియేట్ చేశాయి. మిగిలిన సాంగ్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.






Also Read: బాలయ్య 'అఖండ 2'లో బజరంగీ బాయిజాన్ చైల్డ్ ఆర్టిస్ట్ - మున్ని To జనని... హార్ట్‌లీ వెల్ కం


డబుల్ బొనాంజా


పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఈ ఏడాది డబుల్ బొనాంజ అనే చెప్పాలి. ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజా పాలనలో బిజీగా మారిన పవన్ తాను ఇదివరకే కమిట్ అయిన సినిమాలను త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచరస్ 'హరిహర వీరమల్లు' (Harahara Veera Mallu) ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక పవర్ స్టార్ అవెయిటెడ్ మూవీస్‌లో ఒకటైన 'ఓజీ' సైతం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల ఈ మూవీ నుంచి ఇచ్చిన అప్డేట్స్ వైరల్‌గా మారాయి.


యాక్షన్ థ్రిల్లర్‌ 'ఓజీ' గ్యాంగ్ స్టర్‌గా ఓ డిఫరెంట్ లుక్‌లో పవన్ కనిపించనున్నారు. ఇటీవలే షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. 'ఈసారి యుద్ధం ముగించేద్దాం' అంటూ మేకర్స్ భారీ హైప్ క్రియేట్ చేశారు. 'ఓజీ' కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ఓజీ ఓజీ అంటూ నినాదాలు చేయగా పవన్ సున్నితంగా మందలించారు. ఇటీవలే పవన్ షూటింగ్‌లో జాయిన్ అయ్యి శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న టైంకు సినిమా రిలీజే చేసేందుకు మేకర్స్ శ్రమిస్తున్నారు.