Pawan Kalyan Next Movie With Tamil Director: రీసెంట్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'OG'తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీతో ఆయన బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన సైన్ చేసిన ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇక 'ఉస్తాద్' తర్వాత పవన్ మూవీస్ చేస్తారా? లేదా? అనే దానికీ రీసెంట్‌గా 'OG' ఈవెంట్లలోనే క్లారిటీ ఇచ్చేశారు.
సుజీత్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా 'OG' సీక్వెల్, ప్రీక్వెల్ ఉంటాయని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. అయితే, ఇవి ట్రాక్ ఎక్కేందుకు చాలా టైం పడుతుంది. ఇక పవన్ నెక్స్ట్ మూవీ ఏంటి అనే దానిపై భారీ హైప్ క్రియేట్ అవుతుండగా... ఫిలింనగర్ సర్కిల్లో ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ అవుతోంది.
తమిళ డైరెక్టర్‌తో...
రీసెంట్‌గా 'కూలీ' మూవీతో బిగ్ సక్సెస్ అందుకున్న తమిళ స్టార్ డైరెక్టర్ 'లోకేశ్ కనగరాజ్'తో పవన్ తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. విజయ్‌తో 'జన నాయగన్', యష్‌తో 'టాక్సిక్' మూవీస్ నిర్మిస్తోన్న ఫేమస్ బ్యానర్ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఐకానిక్ క్రేజీ కాంబోను సెట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ ప్రాజెక్టుకు మ్యూజిక్ లెజెండ్ 'అనిరుధ్ రవిచందర్' సంగీతం అందించబోతున్నారట. పవన్, లోకేశ్, అనిరుధ్ కాంబోలో మూవీ అంటేనే ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ వేరే లెవల్‌లో ఉంటున్నాయి. ఇదే నిజమైతే ఇక వారి ఆనందానికి అవధులు ఉండవు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది.
Also Read: ఇట్స్ అఫీషియల్... పవన్ 'OG' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
ప్రస్తుతం పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పవర్ స్టార్ వింటేజ్, స్టైలిష్ లుక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కనిపించనున్నారు. పవన్ సరసన బ్యూటీ శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా... కేఎస్ రవికుమార్, పార్థిబన్, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేం అవినాష్, టెంపర్ వంశీ, రాంకీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా... మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు. హరీష్, పవన్ కాంబోలో వచ్చిన 'గబ్బర్ సింగ్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించగా... 'ఉస్తాద్'పై భారీ అంచనాలే ఉన్నాయి. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.