పాకీజా అంటే ఈతరం ప్రేక్షకులకు తెలిసే అవకాశం తక్కువ. కానీ, పెద్దవాళ్లకు బాగా తెలుసు. బ్రహ్మానందంతో పాటు ఆమె నటించిన సన్నివేశాలు ఇప్పటికీ యూట్యూబ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఆవిడ అసలు పేరు వాసుకి. ఇప్పుడు సినిమాల్లో కనిపించడం లేదు. తన పరిస్థితి బాలేదని సాయం కోరుతూ జనసేన పార్టీకి సమాచారం ఇచ్చారు.
ఒక్క రోజులో స్పందించిన పవన్...వాసుకీకి రెండు లక్షల రూపాయలు!తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి - శ్రీమతి వాసుకి (పాకీజా)కి ఆర్థిక పరిస్థితి తెలిసి ప్రముఖ కథానాయకుడు - ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చలించిపోయారు. విషయం తెలిసిన ఒక్క రోజులో స్పందించారు. వాసుకి దీన స్థితి తెలిసి రూ. 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు పవన్.
మంగళవారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండు లక్షల రూపాయలను పాకీజా (వాసుకి)కి శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్, పి. గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ అందజేశారు.
Also Read: చిరంజీవి సినిమాలో బాలీవుడ్ భామ... 'విశ్వంభర'లో ఐటమ్ సాంగ్ చేసే అందాల భామ ఎవరంటే?
పవన్ కళ్యాణ్ వెంటనే చేసిన సాయానికి వాసుకి కృతజ్ఞతలు తెలిపారు. తన కంటే పవన్ వయసులో చిన్నవారని, ఆయన ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానని భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. తన ఆర్థిక పరిస్థితి గురించి సోమవారం పవన్ కళ్యాణ్ కార్యాలయానికి తెలియజేశాననీ, ఆయన తక్షణం స్పందించి తనకు తగిన ఆర్థిక సాయం అందించారని వాసుకి తెలిపారు. పవన్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానని వాసుకి పేర్కొన్నారు.