సినిమా పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కామన్. నచ్చితే కలిసి ఉంటారు. నచ్చకపోతే విడిపోతారు. అయినప్పటికీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బహుశ పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి జరిగినంత చర్చ మరే నటుడి గురించి జరిగి ఉండకపోవచ్చు. ఇప్పటికే ఆయన రెండు పెళ్లిళ్లు చేసుకుని వారి నుంచి విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మూడో భార్యతో ఉంటున్నారు. అయితే, తాజాగా ఓ సంచలన విషయం వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. పవన్ మూడో భార్యతోనూ ఆయన విడాకులు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఇద్దరూ విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
రష్యాకు వెళ్లిపోయిన అన్నా లెజ్నెవా?
వాస్తవానికి మూడో భార్యతో పవన్ కల్యాణ్ విడాకులకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మెగా ఫ్యామిలీ కూడా ఈ విషయం గురించి ఎలాంటి కామెంట్ చేయలేదు. అఫీషియల్ స్టేట్మెంట్ లేకపోయినా, ఇప్పటికే అన్నా లెజ్నెవా పవన్ కు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆమె పిల్లలతో తిరిగి రష్యాకు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, పవన్ కల్యాన్ ఫోన్ ద్వారా వారితో టచ్ లో ఉన్నారట.
విడాకుల ఊహాగానాలు ఎప్పటి నుంచి అంటే?
పవన్, లెజ్నెవా కలిసి ఉన్న రోజుల్లో మెగా ఫ్యామిలీలో జరిగే అన్ని ముఖ్యమైన వేడుకలకు ఇద్దరు కలిసి హాజరయ్యేవారు. కానీ, రీసెంట్ గా పలు మెగా వేడుకలకు వాళ్లు ఇద్దరు కలిసి రాలేదు. పైగా పవన్ ఒక్కరే కనిపించారు. రీసెంట్ గా జరిగిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుకలో కూడా లెజ్నెవా కనిపించలేదు. అటు వారాహి యాత్రకు ముందు పవన్ నిర్వహించిన రాజకీయ యాగంలోనూ ఆమె కనిపించలేదు. ఇటీవల రామ్ చరణ్, ఉపాసనల కుమార్తె క్లింకారా కొణిదెల నామకరణ కార్యక్రమానికి కూడా పవన్ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే వారి విడాకుల గురించి విస్తృతంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తల వెనుక రాజకీయ కోణం కూడా లేకపోలేదు. పవన్ ప్రత్యర్థులు కావాలనే దీన్ని హైలెట్ చేసి.. మరోసారి ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు అభిమానులు అంటున్నారు. మరి, ఇందులో వాస్తవం ఏమిటనేది త్వరలోనే తెలుస్తుంది.
పవన్, అన్నా లెజ్నెవా గురించి..
పవన్ కల్యాణ్, అన్నా లెజ్నెవా 2013 లో వివాహం చేసుకున్నారు. వీరికి పోలేనా అంజనా పవనోవా, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తొలుత నందినిని పెళ్లి చేసుకున్న పవన్ కల్యాణ్ ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత తనతో కలిసి ఓ సినిమాలో నటించిన రేణు దేశాయ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు అయ్యాక, విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రష్యాకు చెందిన అన్నా లెజ్నెవాను మూడో వివాహం చేసుకున్నారు. తాజాగా ఈ పెళ్లి కూడా పెటాకులు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వరుస సినిమాలతో పవన్ బిజీ
ఇక ప్రస్తుతం పవన్ కల్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నారు. సముద్రఖని దర్శకత్వంలో ‘బ్రో’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో పవన్ తన మేనళ్లుడితో కలిసి యాక్ట్ చేస్తున్నారు. జులై 28న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. అటు క్రిష్ జాగర్లమూడి యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ‘హరి హర వీర మల్లు’లో కూడా నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నారు. దర్శకుడు సుజీత్ తో కలిసి ‘OG’ మూవీలో పని చేస్తున్నారు.
Read Also: మన హీరోల్లో ఇన్‌స్టాగ్రామ్ కింగ్ ఎవరు? ఎవరికి ఎంతమంది ఫాలోవర్స్?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial