టాలీవుడ్ లో గత కొన్ని నెలలుగా నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వీరి లివింగ్ రిలేషన్‌షిప్ గురించి నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇద్దరూ కలసి త్వరలో పెళ్లితో ఒక్కటి కాబోతున్నాం అని.. ఓ వీడియోలో ముద్దు పెట్టుకుని మరీ చెప్పారు. అప్పటి నుంచి వీరి మేటర్ మరింత వైరల్ అవుతోంది. ఇటీవలే ఈ జంట పెళ్లి చేసుకున్నట్టు ఓ వీడియో ఒకటి విడుదల చేశాడు నటుడు నరేష్, తర్వాత వెంటనే హనీమూన్ కు కూడా వెళ్లిపోయారు అని పుకార్లు కూడా వచ్చాయి. దీంతో వీరు నిజంగానే పెళ్లి చేసుకున్నారని అనుకున్నారంతా. అయితే ఆ వీడియో నిజం కాదని, అది ఓ సినిమాలోని సీన్ అని కొట్టిపారేసిన వారు లేకపోలేదు. ఏదేమైనా ఆ పెళ్లి వీడియోతో నరేష్, పవిత్ర మరోసారి చర్చనీయాంశమయ్యారు. అయితే తాజాగా పవిత్ర మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ ఆమె గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


లగ్జరీ లైఫ్ కోసం ఏమైనా చేస్తుంది: సుచేంద్ర ప్రసాద్


పవిత్ర లోకేష్ పై ఆమె రెండో భర్త సుచేంద్ర ప్రసాద్ మొదట్నుంచీ ఆరోపణలు చేస్తూనే వస్తున్నాడు. గతంలో కూడా ఆమె గురించి పలు ఘాటు వ్యాఖ్యలు చేసిన  ఆయన మరోసారి పవిత్రపై ద్వజమెత్తారు. తాజాగా ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. పవిత్ర లగ్జరీ లైఫ్ కోసం ఏమైనా చేస్తుంది అంటూ ఆరోపించాడు. పవిత్ర లోకేష్ పచ్చి అవకాశవాదని, నరేష్ విషయంలో ఆమె పెద్ద ప్లాన్ వేసిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. నరేష్ తల్లి విజయ నిర్మల లేకపోవడంతో నరేష్ ను మోసం చేసి.. ఆమె సంపాదించిన ఆస్తి మొత్తం కొట్టేయాలని పవిత్ర ప్లాన్ చేసిందని అన్నాడు. అందుకే నరేష్ తో సహజీవనం చేస్తుందని చెప్పుకొచ్చాడు. డబ్బు కోసమే ఇప్పటి వరకూ ఇద్దరికి విడాకులు ఇచ్చిందని, డబ్బు కోసమే నరేష్ వెంట తిరుగుతోందని ఆరోపించాడు. ఏదో ఒక రోజు నరేష్ కు కూడా అర్థమవుతుందని వ్యాఖ్యానించాడు.  


ససేమీరా అంటోన్న రమ్య రఘుపతి..


నరేష్, ఆయన భార్య రమ్య రఘుపతికి విడాకులు ఇచ్చి తర్వాత పవిత్రను వివాహం చేసుకోవాలి అని అనుకున్నారనే వార్తలు గతంలో కూడా వచ్చాయి. అయితే రమ్య రఘుపతి మాత్రం నరేష్ కు విడాకులు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉందని సమాచారం. నరేష్ పవిత్ర డేటింగ్ మేటర్ బయటపడినప్పటి నుంచీ రమ్య రఘుపతి వారిపై మండిపడుతోంది. తన ఇంటికి గెస్ట్ గా వచ్చి తన కాపురంలోనే చిచ్చు పెట్టాలని చూస్తోందని పవిత్ర పై విరుచుకుపడుతోంది రమ్య. ఇప్పటికే నరేష్, పవిత్రలపై పలు సార్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇటీవలే నరేష్ పై కూడా సంచలన ఆరోపణలు చేసింది. మరోవైపు రమ్యకు విడాకులు ఇవ్వకుండా పవిత్రను పెళ్లి చేసుకున్నట్టు నరేష్ అఫీషియల్ గా ఎలా అనౌన్స్ చేస్తారు అనే వాదనలు కూడా ఉన్నాయి.  


Also Read శృతి హాసన్ మందు కొట్టి ఆరేళ్ళ - బీర్ కూడా నాన్ ఆల్కహాలిక్ అయితేనే