బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పరిణీతి చోప్రా రీసెంట్ గా పెళ్లి చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ఆమె ఏడు అడుగులు నడించింది. సెప్టెంబరు 24న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లికి సుమారు 200 మందికి పైగా అతిథులు పాల్గొన్నారు. 50 మందికిపైగా వీఐపీలు పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కెజ్రీవాల్  హాజరయ్యారు. టెన్నీస్ ప్లేయర్ సానియా మీర్జా, క్రికెటర్ హర్బజన్ సింగ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, శివసేన నేత ఆదిత్య థాకరే తదితర ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.  


చోప్రా VS చద్దా క్రికెట్ మ్యాచ్


చాలా మంది ప్రముఖులు పెళ్లి వేడుకలను సంగీత్ లాంటి వేడుకలతో మొదలు పెడతారు. కానీ, పరిణీతి, రాఘవ్ కుటుంబాలు కాస్త డిఫరెంట్ గా పెళ్లి వేడుకలను ప్రారంభించాయి. ఇరు కుటుంబ సభ్యులు ఫ్రెండ్లీగా క్రికెట్ మ్యాచ్ ఆడారు. తాజాగా ఈ వీడియోను పరిణీతి ఇన్ స్టా ద్వారా పంచుకుంది. క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు, లెమన్ రేస్,  మ్యూజికల్ చైర్స్ సహా పలు రకాల ఆటలు ఆడారు. బంధుమిత్రులు ఈ ఆటల్లో పాల్గొని సందడి చేశారు.  రెండు కుటుంబాల మధుర క్షణాలను ఈ వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు.  ఇందులో రాఘవ్ బౌలింగ్, బ్యాటింగ్ విన్యాసాలు, పరిణీతి గేమ్స్ లో విజయం సాధించడం అందరినీ ఆకట్టుకున్నాయి.  "పెళ్లి కోసం కొత్త సంప్రదాయాలను సృష్టించాం. ప్రెషర్, డ్రామా లాంటివి లేకుండా అందరం కలిసి ఆహ్లాదంగా గడిపాం” అని పరిణీతి వెల్లడించింది.   






చోప్రాల హృదయాలను గెలుచుకున్నాం- రాఘవ్


ఇక తమ ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్స్ కు సంబంధించి రాఘవ్ సంతోషం వ్యక్తం చేశారు. “మా వివాహానికి ముందు చాలా ఆచారాలు పాటించాం. అంతేకాదు, హ్యాపీగా పలు ఈవెంట్స్ లో పాల్గొన్నాం. ఇందులో మ్యూజికల్ చైర్స్,  లెమన్ రేస్,  మూడు కాళ్ల రేసు, ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఉన్నాయి. ఇవి మా బంధువులను చాలా సంతోష పెట్టాయి. ఈ గేమ్స్ లో మేం విజేతలుగా నిలిచాం. చోప్రాల హృదయాలను గెలుచుకున్నాము. మా కుటుంబంలో ఇదో పండుగ వాతావరణంలా ఉంది” అని రాసుకొచ్చారు.   






సెప్టెంబర్ 22న ఉదయపూర్‌లో మెహందీ ఈవెంట్‌తో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా వివాహా వేడుకలు  ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 23న ఇతర కార్యక్రమాలు నిర్వహించారు. సెప్టెంబర్ 24న ఇద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి అయ్యారు. సంసార జీవితంలోకి అడుగు పెట్టారు.   


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial