మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'ఆదికేశవ' (Aadikeshava Movie). ఇందులో శ్రీ లీల (Sreeleela) కథానాయిక. ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ, ఎస్. సాయి సౌజన్య నిర్మాతలు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ నిర్మాణ సంస్థలు తెరకెక్కించాయి.


ఆగస్టు 18న కాదు... నవంబర్ 10న!
Aadikeshava New Release Date : 'ఆదికేశవ'తో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిజం చెప్పాలంటే... ఈ సినిమాను ఈ రోజు (ఆగస్టు 18న) విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం తెలిపారు. అయితే... నేడు సినిమా విడుదల కాలేదు. ఇవాళ కొత్త విడుదల తేదీ వెల్లడించారు. 


దీపావళి సందర్భంగా నవంబర్ 10న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు చెప్పారు. ఇటీవల ప్యారిస్ (Paris)లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. వైష్ణవ్ తేజ్, శ్రీ లీలపై ఓ పాటను తెరకెక్కించారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. 


త్వరలో తొలి పాట విడుదల
'ఆదికేశవ'కు జి.వి. ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం దర్శకుడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మించిన 'సార్'కు ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చారు. 'మాస్టారు మాస్టారు...' సాంగ్ వైరల్ అయ్యింది. ఇప్పుడీ 'ఆదికేశవ'కు కూడా అద్భుతమైన బాణీలు అందించారని సమాచారం. త్వరలో ఈ సినిమాలో తొలి పాటను విడుదల చేయనున్నారు.


Also Read 'ప్రేమ్ కుమార్' రివ్యూ : పీటల మీద పెళ్లి ఆగితే? ఈసారైనా సంతోష్ శోభన్‌కు హిట్ వస్తుందా?   






వైష్ణవ్ తేజ్, శ్రీ లీల తొలిసారి జంటగా నటించిన చిత్రమిది. దీనిని యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందించారు. ఈ సినిమాలో వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్ నటించారు. ఆమెకు తొలి తెలుగు చిత్రమిది. ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. ఆయన విలన్ రోల్ చేశారు.


'ఇంత తవ్వేశారు! ఆ గుడి జోలికి మాత్రం రాకండయ్యా!' - 'ఆదికేశవ' ఫస్ట్ గ్లింప్స్ (Aadikeshava First Glimpse) ప్రారంభంలో వినిపించిన డైలాగ్! ఆ మాట వినిపించే సమయంలో స్క్రీన్ మీద చూస్తే... గుడి వెనుక అంతా తవ్వేసిన దృశ్యం! గుడిలో శివ లింగానికి హారతి ఇస్తున్న పూజారి! ఆ తర్వాత దృశ్యాలు చూస్తే... కథ ఏమిటి? అనేది చాలా క్లారిటీగా అర్థం అయిపోతుంది.


గుడికి రక్షకుడిగా రుద్ర కాళేశ్వర్!
'ఆదికేశవ' సినిమాలో కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ పేరు రుద్ర కాళేశ్వర్ రెడ్డి. మైనింగ్ చేసే కొందరు గుడి వెనుక భాగం అంతా తవ్వేస్తారు. ఆ తర్వాత గుడిని కూడా తవ్వేయాలని వస్తారు. అప్పుడు వాళ్ళను హీరో ఎలా అడ్డుకున్నాడు? ఆ గుడికి రక్షకుడిగా ఎలా నిలబడ్డాడు? అనేది కథాంశంగా తెలుస్తోంది. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ మాస్ ప్రేక్షకులకు చేరువ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.


Also Read కాళహస్తిలో 'కన్నప్ప'ను ప్రారంభించిన విష్ణు మంచు - హీరోయిన్, దర్శకుడు ఎవరంటే?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial