Vande Mataram Song  Release: మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్, మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్‌ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలంటైన్’. ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ నేపథ్యంలో ఈ మూవీని డైరెక్టర్‌ శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. వైమానిక దాడులు, దేశభక్తి కలబోతగా ఒకేసారి తెలుగు, హిందీ భాషల్లో సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో  మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.  త్వరలో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో మూవీ నుంచి అప్‌డేట్‌ వదిలింది టీం. ఫస్ట్‌ సింగిల్‌ పేరుతో ఈ తొలిసాంగ్‌ను తెలుగు, హిందీలో భాషల్లో  రిలీజ్‌ చేసింది చిత్ర బృందం.  


గూస్ బంప్స్ తప్పించేలా  ‘వందేమాతరం’ లిరికల్‌ సాంగ్‌


తెలుగులో అనురాగ్ కులకర్ణి, హిందీలో సుఖ్వీందర్ సింగ్  పాడిన ‘వందేమాతరం’  పాటను తాజాగా రిలీజ్‌ చేశారు. ముందుగా చెప్పినట్టే ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు ‘వాఘా బోర్డర్’లో గ్రాండ్ గా ఈ ఫస్ట్‌ సింగిల్‌ లిరికల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. వందేమాతరం అంటూ సాగే ఈ పాట దేశభక్తిని చాటుతోంది. ఈ పాట వింటుంటే భారతీయుల్లో గూస్‌బంప్స్‌ రావడం ఖాయం. అంతగా ఆకట్టుకున్న ఈ పాటకు సోషల్‌ మీడియాల్లో మంచి రెస్పాన్స్‌ వస్తుంది. కాగాఈ పాటను రిలీజ్‌ చేస్తుండగా వాఘా బార్డర్ లో భారత్, పాక్ సైనికుల కవాతు నిర్వహించినట్టు తెలుస్తోంది. దీని కోసం వరుణ్‌ తేజ్‌ ఇవాళ వాఘా బార్డర్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. నిన్నటి వరకు సంక్రాంతి వేడుకల్లో భాగంగా బెంగుళూరులో ఉన్న వరుణ్‌ నిన్న హైదరాబాద్‌కు చేరుకున్నాడు. నేడు ఈ పాట విడుదల నేపథ్యంలో మధ్యాహ్నం వాఘా బార్డర్‌కు చేరుకుని పాట విడుదల కార్యక్రమంలో పాల్గొన్నాడు. కాగా మిక్కి జే మేయర్ స్వరాలు సమకూర్చిన ఈ పాటను తెలుగులో అనురాగ్ కులకర్ణి పాడగా, హిందీలో సుఖ్వీందర్ సింగ్ పాడారు. 



‘ఆపరేషన్ వాలంటైన్’ కథ..


ఈ సినిమాను భారత వైమానికి దాడులకు సంబంధించిన కొన్ని యథార్థ సంఘటనలను బేస్ చేసుకుని రూపొందిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇటీవల విడుదలైన టీజర్ సైతం ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది.  పాక్ ఉగ్ర స్థావరాలు, లాంఛ్ ప్యాడ్స్ మీద దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా రూపొందించినట్లు అర్థం అవుతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్  సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. “మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్‍ది కూడా” అంటూ ఎయిర్ ఫోర్స్ కమాండర్ గా వరుణ్ తేజ్ చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.  


ఫిబ్రవరి 16న ‘ఆపరేషన్ వాలంటైన్’ విడుదల


శక్తి ప్రతాప్ సింగ్ ఈ మూవీతోనే దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న విడుదలకానుంది.కొంతకాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్న వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలంటైన్’ మీద భారీగా అంచనాలు పెట్టుకున్నాడు. ఆయన గత చిత్రాలు వరుసగా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ‘గని’, ‘గాండీవధారి అర్జున’ సినిమాలు దారుణ ఫలితాలను ఇచ్చాయి. ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి ఎక్కాలని ఆయన భావిస్తున్నారు.