దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో విజయం తర్వాత చేసే సినిమాతో సక్సెస్ అందుకోవడం కష్టమని ఇండస్ట్రీలో ఒక నానుడి ఉంది. జక్కన్నతో పని చేసి హిట్ అందుకున్న తర్వాత చేసిన సినిమా డిజాస్టర్ అవుతుందనే‌ సెంటిమెంట్ తప్పని 'దేవర'తో ప్రూవ్ చేశారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR). దేవరకు ముందు ఆయన రెండు సినిమాలు అంగీకరించారు. అందులో అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం!

థియేటర్లలోకి రావడానికి సరిగ్గా ఏడాది!'దేవర' తర్వాత ఎన్టీఆర్ రిలీజ్ ప్రశాంత్ నీల్ సినిమా కాదు... హిందీ సినిమా పరిశ్రమకు ఆయన పరిచయం అవుతున్న 'వార్ 2'. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న ఆ సినిమా విడుదల కానుంది. దాని కంటే నీల్ సినిమా మీద ఎక్కువ క్రేజ్ ఉంది.

'వార్ 2' సినిమాలో ఎన్టీఆర్ సోలో హీరో కాదు... బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కూడా ఉన్నారు. పైగా అందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ కాస్త నెగిటివ్ షేడ్స్‌తో ఉంటుందని టాక్. ప్రశాంత్ నీల్ సినిమాకు వస్తే ఆయన సోలో హీరో. 'కేజిఎఫ్', 'సలార్' వంటి భారీ బ్లాక్ బస్టర్స్ తీసిన ట్రాక్ రికార్డ్ దర్శకుడికి ఉంది. అందువల్ల నీల్ సినిమా కోసం ఆడియన్స్ అండ్ ఫాన్స్ ఎక్కువ వెయిట్ చేస్తున్నారు. 

జూన్ 25, 2026... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'డ్రాగన్' థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా టైటిల్ ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారని టాక్. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో భారీ ఎత్తున విడుదల అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

యమా క్రేజీగా ఎన్టీఆర్ లైనప్... నెక్స్ట్!?NTR Upcoming Movies: 'వార్ 2', 'దేవర' సినిమాల తర్వాత ఎన్టీఆర్ చేయబోయే మరో మూడు సినిమాలో ఖరారు అయ్యాయి. మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' చేశారు. అయితే అది తెలుగులో మాత్రమే విడుదల చేసిన సినిమా. కానీ, ఇప్పుడు త్రివిక్రమ్ పాన్ ఇండియా టార్గెట్ చేశారు. అందులోనూ యుద్ధానికి అధిపతి కుమారస్వామి కథతో మైథాలజికల్ టచ్ ఉన్న సినిమా చేస్తున్నారు. దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read: 'కన్నప్ప' థియేటర్స్ దగ్గర ప్రభాస్ మేనియా... తెలుగు రాష్ట్రాలలో భారీ కటౌట్లు!

త్రివిక్రమ్ సినిమాతో పాటు రజనీకాంత్ 'జైలర్' ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించారు ఎన్టీఆర్. ఆ సినిమా వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 'జైలర్ 2' చేసిన తర్వాత ఎన్టీఆర్ సినిమా వర్క్ మొదలు పెడతారు నెల్సన్. త్రివిక్రమ్ సినిమాతో పాటు ఆయన సినిమా కూడా సమాంతరంగా మొదలయ్యే అవకాశం ఉంది. ఆ రెండు సినిమాలు హరిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలపై రూపొందుతాయి. సూర్యదేవర ఫ్యామిలీ నిర్మాతలు అన్నమాట. దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ కూడా అంగీకరించారు. పలువురు బాలీవుడ్ దర్శకుల సైతం ఎన్టీఆర్ హీరోగా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరో రెండు మూడేళ్లు ఎన్టీఆర్ డైరీ ఫుల్ అయ్యింది.

Also Read'కూలీ' రైట్స్ రేసులో టాప్ ప్రొడ్యూసర్లు... రజనీ సినిమా హక్కులకు భారీ పోటీ... 100 కోట్లు కొడితే తప్ప గట్టెక్కలేరు