పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటించిన 'ఓజీ' (OG Movie) విడుదలకు రెండు వారాలు మాత్రమే సమయం ఉంది. సెప్టెంబర్ 25న ఈ సినిమా థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. అంత కంటే ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. దానికి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ముఖ్య అతిథిగా రానున్నట్లు సమాచారం.
చిరంజీవి ముఖ్య అతిథిగా ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్!ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేవలం కథానాయకుడు మాత్రమే కాదు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా! ఒక వైపు డిప్యూటీ సీఎంగా తన బాధ్యతల నిర్వహిస్తూ... మరొక వైపు సినిమా పనులు పూర్తి చేస్తున్నారు. సినిమా ఈవెంట్స్ కూడా డిప్యూటీ సీఎం షెడ్యూల్ డిస్టర్బ్ కాకుండా ప్లాన్ చేస్తున్నారు. అందువల్ల ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసినట్లు తెలిసింది.
OG Pre Release Event Date: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఫెస్ట్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా ప్రతి రోజూ సినిమాకు సంబంధించి ఒక కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేశారు. ఈ నెల 20వ తేదీన... అంటే సెప్టెంబర్ 20న విజయవాడలో 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఆ కార్యక్రమానికి చిరు వస్తారని టాక్. అది నిజమైతే అన్నదమ్ములను ఒక వేదికపై చూడటం మెగా అభిమానులకు కనువిందుగా ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: హనుమంతుడిపై పాన్ ఇండియా సినిమా... సితారలో చందూ మొండేటి 'వాయుపుత్ర' - కాన్సెప్ట్ పోస్టర్ చూశారా?
ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్, అలాగే మెగా అభిమానులు అందరూ 'ఓజీ' ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 25న తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద డీవీవీ దానయ్య, దాసరి కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రమిది. పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, జగపతి బాబు, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.