'ఆర్ ఆర్ ఆర్' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ వచ్చిన విషయం తెలిసిందే. అయితే త్రిబుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. 'ఆర్ ఆర్ ఆర్' విడుదలైన సంవత్సరం తర్వాత ఎన్టీఆర్ తన తదుపరిచిత్ర షూటింగ్లో పాల్గొన్నాడు. అదే కొరటాల శివ తెరకెక్కిస్తున్న 'దేవర' మూవీ. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ పోస్ట్ ని విడుదల చేయగా పోస్టర్ కి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. పాన్ ఇండియా లెవెల్ లోనే ఈ మూవీ ఉండబోతోంది. ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే కొత్త షెడ్యూల్ షూటింగ్ ని మొదలుపెట్టనుంది. అయితే ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ ఇప్పటికే మరో రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి సైన్ చేసిన విషయం తెలిసిందే.


అందులో ఒకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న 'NTR31'  కాగా మరొకటి బాలీవుడ్లో హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్న 'వార్2'. అయితే ఇందులో 'దేవర' మూవీ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ పైకి వెళుతుంది. సాధారణంగా ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా పూర్తయ్యేంతవరకు మరో సినిమాను మొదలు పెట్టడు. కానీ ఈసారి మాత్రం తన పంథా మారుస్తున్నాడట ఈ నందమూరి హీరో. ఇటీవల ఎన్టీఆర్ బడా ప్రాజెక్టు వార్2 కి సైన్ చేసిన విషయం తెలిసిందే కదా. హృతిక్ రోషన్ నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్లో ఎన్టీఆర్ విలన్ గా కనిపించబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం 'దేవర' షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్స్ లో ఒకేసారి పాల్గొంటాడట. అలా రెండు సినిమా షూటింగ్స్ ని ఒకే సమయంలో పూర్తి చేయాలని ఎన్టీఆర్ డిసైడ్ అయినట్లు ఫిలిం సర్కిల్స్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.


అన్ని సవ్యంగా జరిగితే ఎన్టీఆర్ నుంచి 2025లో ఏకంగా రెండు బడా పాన్ ఇండియా సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సో మొత్తం మీద ఎన్టీఆర్ రాబోయే రెండేళ్లలో ఏకంగా మూడు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం దేవర విషయానికొస్తే.. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించారు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్ని బేట్స్ నేతృతంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించారు. అక్కడితో ఓ షెడ్యూల్ పూర్తవగా.. తాజాగా ఎన్టీఆర్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ట్రిప్ కి వెళ్ళిపోయారు. వేసవి సెలవుల సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ వారం రోజులపాటు విదేశాల్లోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మళ్లీ ట్రిప్ ముగించుకుని వచ్చాక యధావిధిగా 'దేవర' షూటింగ్లో జాయిన్ కానున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నాడు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read: షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!